ఎవ‌రు అన్నారో కానీ.. వైసీపీ నేత‌ల నుంచి టీడీపీ నెంబ‌ర్‌-2, ఆ పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి లోకేష్‌ను `ప‌ప్పు` అనేశారు. దీనిని టీడీపీ నేత‌లు ఖండించ‌లేదు. ఎదురు దాడి చేసి స‌రిపెట్టారు. వైసీపీ నేత‌లు అన్న‌ట్టుగానే లోకేష్ రాజ‌కీయాలు కూడా న‌డుస్తున్నాయి. ఆయ‌న మాట్లాడుతున్న తీరు.. త‌ప్పులు క‌ప్పిపుచ్చుతున్న తీరు కూడా అచ్చు ప‌ప్పునే గుర్తుకు తెస్తున్నాయి. తాజాగా అచ్చెన్నాయుడు విష‌యంలోను, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి విష‌యంలోనూ తాజాగా లోకేష్ మాట్లాడారు. అయితే, ఎక్క‌డా కూడా ఆయ‌న జ‌రిగింది జ‌రిగిన‌ట్టు చెప్పుకొనేందుకు, ఒప్పుకొనేందుకు సిద్ధ‌ప‌డ‌లేదు.

 

ప్ర‌భాక‌ర్ రెడ్డి విష‌యంలో సొంత సోద‌రుడు, మాజీ ఎంపీ దివాక‌ర్‌రెడ్డి కూడా మావోడు కొన్ని త‌ప్పులు చేస్తే.. చేసి ఉండొచ్చు- అని కుండ‌బ‌ద్ద‌లు కొట్టారు. కానీ,.. ఇదే విష‌యంపై మాట్లాడిన లోకేష్‌.. ఆస‌క్తికర వ్యాఖ్య‌లు చేశారు. ``కంపెనీ వాళ్లు బ‌ళ్లు అమ్మారు. వీరు కొన్నారు. ఇందులో త‌ప్పేముంది. నేనైనా అంతే క‌దా.. మీరైనా అంతేక‌దా.. కంపెనీ వాళ్లు అమ్మిన త‌ర్వాత అది బీఎస్‌-3నా బీఎస్ -33నా అని ఎవ‌రు మాత్రం చూస్తారు. ఏదైనా ఉంటే.. కంపెనీపై కేసులు పెట్టుకోవాలి. లేదా వాటిని రిజిస్ట్రేష‌న్ చేసిన అధికారుల‌పై కేసులు పెట్టాలి!`` అన్నారు.

 

ఈ వ్యాఖ్య‌లు విన్న వారికి లోకేష్ .. ఇంత ప‌ప్పా? అనే సందేహం వ‌చ్చింది. ప్ర‌భాక‌ర్‌రెడ్డికి( అదే వారి కంపెనీకి) లారీ ఛాసిస్‌లు అమ్మిన అశోక్ లేలాండ్ కంపెనీ.. స్ప‌ష్టంగా రెండు రోజుల కింద‌ట పేప‌ర్‌లో ఒక ప్ర‌క‌ట‌న ఇచ్చింది. తాము.. ప్ర‌భాక‌ర్‌రెడ్డి కంపెనీకి బీఎస్‌-3 ఛాసిస్‌ల‌ను తుక్కు కింద విక్ర‌యించాం. వాటిని వినియోగించ‌రాద‌ని కూడా చెప్పాం. దీనికి అంగీక‌రించారు. అని పేర్కొంది.

 

కానీ, ప్ర‌భాక‌ర్ చేసింది ఏమిటి?  వాటిని బీఎస్‌-4గా పేర్కొంటూ.. ఛాసిస్ నెంబ‌ర్ల‌లో మార్పులు చేసి ఎక్క‌డో కోహిమా(నాగాలాండ్ రాజ‌ధాని)లో రిజిస్ట్రేష‌న్ చేయించి తిప్పేశారు. వీటిలో నాలుగింటిని బ‌స్సులుగా కూడా మార్చేశారు. ఇది క‌దా అక్ర‌మం! ఇంత స్ప‌ష్టంగా త‌ప్పు క‌నిపిస్తున్నా.. లోకేష్ బాబు ఇలా మాట్లాడితే.. మ‌రి ప‌ప్పు.. అన‌కుండా ఎవ‌రు ఉంటారు చెప్పండి! అంటున్నారు వైసీపీ నాయ‌కులు.

మరింత సమాచారం తెలుసుకోండి: