ఏపీ అసెంబ్లీ సమావేశాలు మొదలుకావడంతో అనూహ్యంగా మళ్ళీ మూడు రాజధానులపై చర్చ మొదలైంది. ఊహించని విధం మూడు రాజధానులపై గవర్నర్ ప్రసంగించడంతో టీడీపీ ఒక్కసారిగా షాక్‌కు గురైంది. పరిపాలన వికేంద్రీకరణ అత్యంత కీలకమని, అన్ని ప్రాంతాల అభివృద్ధే తన ప్రభుత్వ ఉద్దేశమని గవర్నర్ తెలిపారు.

 

ఇక శాసన రాజధానిగా అమరావతి, కార్యానిర్వాహక రాజధానిగా విశాఖపట్నం, న్యాయ రాజధానిగా కర్నూలు ఉంటుందని, ప్రస్తుతం మూడు రాజధానుల బిల్లు శాసన ప్రక్రియలో ఉందని అన్నారు. మూడు రాజధానులకు తన ప్రభుత్వం కట్టుబడివుందని, భవిష్యత్తులో తన ప్రభుత్వానికి మంచి రోజులు వస్తాయని, ఈ బిల్లు కూడా ఆమోదం పొందుతుందని గవర్నర్ తన ప్రసంగంలో చెప్పారు.

 

అయితే గవర్నర్ ప్రసంగం అంటే అది...వైసీపీ డైరక్షన్‌లో ఉండే ప్రసంగమనే సంగతి తెలిసిందే కదా అని టీడీపీ శ్రేణులు అంటున్నాయి. కాకపోతే ఇక్కడ మూడు రాజధానుల బిల్లుని మండలి ఛైర్మన్ సెలక్ట్ కమిటీకి పంపించడం, అప్పుడే మండలిని రద్దు చేసి ఆ తీర్మానాన్ని జగన్ కేంద్రానికి పంపించడం జరిగాయి. కానీ ఈ ప్రక్రియ ఇలా ఉంటే, గవర్నర్ మాత్రం శాసన ప్రక్రియలో ఉందని చెప్పడంతో జగన్ వ్యూహం ఏంటనేది టీడీపీ శ్రేణులకు అర్ధంకాక బుర్రలు బద్దలుకొట్టుకుంటున్నారు.

 

ఇక మూడు రాజధానులకు సంబంధించిన బిల్లులు మళ్లీ తీసుకురావటం తప్పుడు విధానమని, శాసన మండలి ఇప్పటికే సెలక్ట్ కమిటీకి సిఫార్సు చేసిన బిల్లులను మళ్లీ ఎలా తెస్తారని చంద్రబాబు ప్రశ్నించారు. మండలిలో మళ్లీ గట్టిగా పోరాడతామని అన్నారు. కానీ కొత్త రాజధాని కోసం జగన్ ప్రభుత్వం రూ.500 కోట్లు కేటాయించింది. దీంతో మూడు రాజధానుల ప్రక్రియకు ఎలాంటి ఇబ్బంది లేదని తెలుస్తోంది.

 

అయితే మండలి రద్దు అవ్వడం వల్ల మూడు రాజధానుల ఏర్పాటుకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఈ ప్రక్రియ కేంద్ర పరిధిలో ఉండటంతో ఎప్పుడు పూర్తి అవుతుందో చెప్పలేం. సంవత్సరంపైనే ఈ ప్రక్రియకు సమయం పట్టోచ్చు.  ఇదే సమయంలో మండలిలో వైసీపీ బలం పెరిగే అవకాశాలున్నాయి. అప్పుడు కూడా మూడు రాజధానుల బిల్లుకు అడ్డు ఉండదు. ఇక ఈ రెండిటిలో ఏదొకటి జరిగితేనే మూడు రాజధానులు ఏర్పాటు జరుగుతుంది. కానీ ఇవిగాకుండా జగన్ వేరే ఏమన్నా వ్యూహంలో వెళితే అతి త్వరలోనే మూడు రాజధానులు ఏర్పాటు అయిపోవచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: