జగన్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి కావడంతో, ఆయన పాలనపై, మంత్రుల పనితీరుపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. ఎక్కువ శాతం జగన్ పాలన పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తున్నా...కొందరు మంత్రుల పనితీరుపై మాత్రం పెదవి విరుస్తున్నారు. సంవత్సరం దాటుతున్న కొందరు మంత్రులు తమ శాఖలపై ఇంకా పట్టు తెచ్చుకోలేదని, అసలు కొందరు మంత్రులన్న సంగతి చాలామంది ప్రజలకు తెలియదని అంటున్నారు.

 

అయితే పనితీరు బాగోకపోతే వారిని పదవి నుంచి తొలగించి, కొత్తవారికి అవకాశమిస్తానని జగన్, మంత్రి వర్గం ఏర్పాటు చేసిన రోజే చెప్పేశారు. రెండున్నర ఏళ్లలో ఈ కార్యక్రమం చేస్తానని చెప్పారు. ఇక ఇప్పుడు ఏడాది పూర్తి కావడంతో, వచ్చే ఏడాదిన్నరలో కొందరు పదవులు పోవడం ఖాయం. ఈ క్రమంలోనే విశాఖపట్నంలో ఏకైక మంత్రి అవంతి శ్రీనివాస్ పదవి కూడా పోతుందని, జిల్లా వైసీపీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

 

మంత్రిగా ఆయన అంత మంచి పనితీరు ఏమి కనబర్చలేదని, కాబట్టి నెక్స్ట్ అవంతిని సైడ్ చేసి, విశాఖలో దూకుడుగా పనిచేస్తున్న యువ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్‌కు మంత్రి రావడం ఖాయమని అంటున్నారు. 2014 ఎన్నికల్లో అమర్నాథ్ అనకాపల్లి ఎంపీగా పోటీ చేసి, టీడీపీ నుంచి పోటీ చేసిన అవంతి చేతిలో ఓడిపోయారు. ఇక అవంతి 2019 ఎన్నికల ముందు వైసీపీలోకి వచ్చి భీమిలి నుంచి పోటీ చేసి గెలిచి, మంత్రి అయిపోయారు.

 

ఇటు అమర్నాథ్ 2019 ఎన్నికల్లో అనకాపల్లి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. జగన్‌కు అత్యంత సన్నిహితంగా ఉండే అమర్నాథ్‌కు నెక్స్ట్ టర్మ్‌లో మంత్రి పదవి రాబోతుందని ప్రచారం జరుగుతుంది. ప్రతిపక్ష టీడీపీ మీద దూకుడుగా విమర్శలు చేసే అమర్నాథ్‌కు పదవి ఇస్తే ఇంకా అడ్వాంటేజ్ అవుతుందని, పార్టీ ఇంకా బలపడుతుందని వైసీపీ వర్గాలు అంటున్నాయి. మొత్తానికైతే నెక్స్ట్ టర్మ్‌కు అవంతిని సైడ్ చేసేసి అమర్నాథ్‌కు పదవి వచ్చే అవకాశాలున్నాయని తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: