ప్ర‌పంచం అంతా ఆస‌క్తిగా, ఒకింత ఉత్కంఠ‌గా ఎదురుచూస్తున్న విష‌యంలో స్ప‌ష్ట‌త వ‌చ్చింది. ప్రపంచ దేశాలు కరోనా వైరస్ వ్యాప్తితో ఓ వైపు ఉక్కిరి బిక్కిరి అవుతుంటే... మ‌రోవైపు ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాక్సిన్ ను కనిపెట్టేందుకు సైంటిస్ట్ లు పోటీపడుతున్నారు. ఇలా ప్ర‌పంచం ఉద్విగ్నంగా నిరీక్షిస్తున్న త‌రుణంలో‌....కరోన్ వైరస్ వ్యాక్సిన్ త్వరలో అందుబాటులోకి వస్తుందంటూ ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ సైంటిస్ట్ ప్రకటించారు. దీంతో కొత్త ఆశ‌లు రేకెత్తించారు.

 

కరోనా వైరస్ వ్యాక్సిన్ రూపొందిస్తున్న సైంటిస్టుల బృందానికి నాయకత్వం వహిస్తున్న ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ సైంటిస్ట్ జాన్ బెల్ తాజాగా వివ‌రాలు వెల్ల‌డించారు.  యూకేకి చెందిన ప్రముఖ మీడియా సంస్థ లీడింగ్ బ్రిటన్ కన్వర్ జేషన్ తో మాట్లాడుతూ ఓ టీకాను తయారు చేసి ఆ టీకాను వివిధ దశల వారీగా మూగజీవాల్లో ప్రయోగించి ఆ తరువాత మనుషులపై ప్రయోగిస్తారు. ప్రయోగాల్లో విజయం సాధిస్తే టీకా అందుబాటులోకి వస్తుంది. తాజాగా ఆ ప్రయోగాలు విజయవంతం అవుతున్నట్లు తెలిపారు. కరోనా వైరస్ వ్యాక్సిన్ ను సెప్టెంబర్ నాటికి అందుబాటులోకి వస్తుందని అన్నారు. ప్రస్తుతం సైంటిస్ట్ జాన్ బెల్ సారధ్యంలో ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ డెవలప్ చేస్తున్న ఆస్ట్రా జెన్ కా టీకాను యూకేలో 2/3 క్లినికల్ ట్రయల్స్ లో ఉన్నాయి. అదే టీకాను జులైలో బ్రెజిల్ లో 2వేల మందిపై ట్రయల్స్ చేయనున్నారు.

 


త‌మ ప్ర‌యోగం గురించి జాన్ వివ‌రిస్తూ సాధారణంగా ఓ వ్యాక్సిన్ ను తయారు చేయాలంటే 8సంవత్సరాలు పడుతుందని కానీ తమ సైంటిస్టులు అహర్నిశలు కృషి చేస్తూ కేవలం 18వారాల్లో వ్యాక్సిన్ ను అందుబాటులోకి తెస్తున్నారని అన్నారు. అన్నీ అనుకున్నట్లు ప్రణాళిక బద్ధంగా జరిగితే వ్యాక్సిన్ నవంబర్ కల్లా అందుబాటులోకి వస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. తాము అభివృద్ధి చేస్తున్న టీకాతో జెన్నర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ సైంటిస్ట్ లు ప్రయోగాలు చేసుకోవచ్చన్నారు. దీంతో టీకాను అభివృద్ధి చేయడం సుల‌భం అవుతుందని ఆయ‌న వివ‌రించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: