టీఆర్ ఎస్ ప్ర‌జాప్ర‌తినిధులు వ‌రుస‌గా క‌రోనాబారిన ప‌డుతున్న విష‌యం తెలిసిందే. నిత్యం ప్ర‌జాక్షేత్రంలో తిరుగుతున్న నేత‌లు క‌రోనా కాటుకు గుర‌వుతున్నారు. ఇటీవ‌ల జ‌న‌గామ ఎమ్మెల్యేతో పాటు ఆయ‌న కుటుంబంలో ఐదుగురికి క‌రోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయిన విష‌యం తెలిసిందే. ఆ త‌ర్వాత నిజామాబాద్ అర్బ‌న్ మ‌రియు రూర‌ల్ ఎమ్మెల్యేలు ఇద్ద‌రికి క‌రోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయింది. ఇక ప్ర‌స్తుతం మంత్రి హ‌రీష్‌రావుకు హోం క్వారంటైన్‌లో కొన‌సాగుతున్నాడు. అలాగే మంత్రి ఈటెల రాజేంద‌ర్ సిబ్బందిలో ఒక‌రికి రావ‌డంతో మంత్రి కూడా అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. ప్ర‌జ‌ల‌కు దూరంగా ఉంటున్నారు. 

 

మూడు రోజుల్లో ముగ్గురు ఎమ్మెల్యేలకు పాజిటివ్‌ రావడంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రజాప్ర తినిధుల్లో కరోనా ఫియర్ మొదలైంది. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు సహా అన్ని ప్రోగ్రామ్స్ క్యాన్సిల్ చేసుకుని హోం క్వారంటైన్ కు వెళ్తున్నారు. మూడు రోజుల క్రితం నిజామాబాద్ జిల్లాలో ఇద్దరు ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్ అని తెలుసుకొని మంత్రి వేముల ప్రశాంత్‍రెడ్డి నియోజకవర్గంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాల‌కు దూరంగా ఉన్నారు.ఆయ‌న ప‌ర్య‌ట‌నల‌న్నీ కూడా వాయిదా వేసుకున్నారు.  హుటాహుటిన హైదరాబాద్‌లోని వెళ్లారు.వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సెక్యూరిటీలోని ఓ ఏఎస్సైకి కరోనా పాజిటివ్ వచ్చిన విష‌యం తెలిసిందే. 

 

దీంతో స‌ద‌రు మంత్రి కూడా హోం క్వారంటైన్‌లో ఉంటున్నారు. తాను చెప్పేంత వ‌ర‌కు ఎవ‌రూ కూడా తనను కలిసేందుకు రావద్ద ని  అనుచరులు, కార్యకర్తలు, లీడర్లకు చెప్పారు. నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డివారం రోజుల పాటు కార్య‌క్ర‌మాల‌న్నీ క్యాన్సిల్ చేసుకున్నారు. ..మంత్రి గంగుల కమలాకర్  హైదరాబాద్ నివాసంకే ప‌రిమిత‌మ‌య్యారు.ఇక మంత్రులు ఈటల రాజేందర్, పువ్వాడ అజయ్‌‌ ‌‌కొద్ది రోజులుగా హైదరాబాద్‌లోనే ఉంటున్నారు.  వాస్త‌వానికి ఎమ్మెల్యేలు  పీఏ లు, గన్‌‌‌‌మెన్లను కూడా విధుల్లోకి రావ‌ద్ద‌ని, అవ‌స‌ర‌మైన‌ప్పుడు తామే పిలుస్తామ‌ని చెబుతుండ‌టం గ‌మ‌నార్హం. నియోజకవర్గాల్లో ఉంటే ఎవరో ఒకరు వచ్చి కలుస్తున్నారనే భయంతో హైదరాబాద్ కు షిఫ్ట్ అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: