ఒక వైపు కరోనా వైరస్‌కు కారణమై ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తున్న చైనా ఇకనైనా బుద్ధితెచ్చుకుని అన్ని దేశాలతో సౌఖ్యంగా ఉంటుందని భావిస్తే, రోజు రోజుకు మితిమీరి పోతున్న ఆగడాలతో ఇంకా తలనొప్పులు తేస్తుంది.. ఇప్పటికే చైనా చేసిన పనివల్ల కరోనా వైరస్ తీవ్రంగా వింజృంభిస్తున్న నేపధ్యంలో భారత్ పలు సమస్యలను ఎదుర్కొంటున్న సమయంలో, ఒకవైపు నేపాల్‌ను రెచ్చగొట్టడమే కాకుండా మరోవైపు పాకిస్దాన్‌కు వంత పాడుతుంది.. ఇంతకాలం ఇండియాకు పాకిస్దాన్ ఒక్కటే శత్రుదేశం అనుకోగా క్రమక్రమంగా చైనా కూడా తన మిత్ర స్దానాన్ని కోల్పోతుంది..

 

 

ఇకపోతే తూర్పు లఢక్‌లోని గాల్వన్‌ లోయలో సోమవారం జూన్ 15వ తేదీన రాత్రి భారత్‌-చైనా బలగాల మధ్య చోటు చేసుకున్న వాగ్వాదం.. తీవ్ర హింసాత్మక ఘర్షణలకు దారితీసిన సంగతి తెలిసిందే. కాగా ఈ ఘర్షణలో ఒక కమాండింగ్‌ అధికారితో పాటు 20 మంది భారత సైనికులు వీరమరణం పొందారని ఇండియన్ ఆర్మీ ధ్రువీకరించినట్లు వార్తలు వస్తున్న నేపధ్యంలో ఈ ఘటనలో అమరులైన సైనికుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలుపుతున్నాయి.. ఇక ఈ దాడిలో చైనా వైపు దీనికి రెట్టింపు సంఖ్యలో నష్టం జరగడం గమనార్హం. ఇక ఈ ఘర్షణలో గాయపడిన, చనిపోయిన చైనా జవాన్ల సంఖ్య 43 వరకు ఉండొచ్చని, సైనికుల మృతదేహాలను తీసుకెళ్లడానికి లఢక్ సరిహద్దుకు చైనా పెద్ద సంఖ్యలో హెలికాప్టర్లను తరలించిందని ఏఎన్ఐ వెల్లడించింది. ఒకరకంగా డ్రాగన్‌పై ఇండియన్ ఆర్మీకి ఇది ఘన విజయమే అంటున్నారు..

 

 

ఇదిలా ఉండగా నలబై ఐదు సంవత్సరాల తర్వాత భారత్‌, చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణల్లో ప్రాణనష్టం జరగడం ఇదే తొలిసారి. కాగా 1975లో అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దులో చైనా బలగాలు జరిపిన కాల్పుల్లో నలుగురు జవాన్లు అమరులయ్యారు. ఇకపోతే చైనా ఈ మధ్యకాలంలో అమెరికా విషయంలో భారత్‌తో కయ్యానికి కాలుదువ్వుతూ హెచ్చరికలు కూడా జారిచేసింది.. చివరికి అన్నంత పనిచేసింది.. ఏది ఏమైనా ప్రస్తుతం జరిగిన ఈ ఘటన వల్ల భవిష్యత్తులో చైనా నుండి ఎటువంటి అపాయం ఉండదని మాత్రం అనుకోకూడదని అంటున్నారు.. ఇందుకు గాను ప్రణాళికలు సిద్దం చేసుకుని సాధ్యమైనంత వరకు సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకుంటే మేలని కొందరు అభిప్రాయపడుతున్నారట.. 

మరింత సమాచారం తెలుసుకోండి: