దేశంలో కరోనా వైరస్ ఉగ్ర రూపం దాలుస్తోంది. అన్ లాక్ 1.0 సడలింపుల వల్ల ప్రమాదకర స్థాయిలో వైరస్ విజృంభిస్తోంది. ప్రతిరోజూ 10,000కు పైగా కేసులు నమోదవుతున్నాయి. వైరస్ తీవ్రత అంతకంతకూ పెరుగుతోంది. వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే మాత్రమే వైరస్ ను కట్టడి చేయడం సాధ్యమవుతుందని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. జనవరిలో అడుగుపెట్టిన ఈ వైరస్ కొద్దిరోజుల్లోనే పదుల సంఖ్య నుంచి వేలల్లోకి చేరింది. 
 
కరోనాను నియంత్రించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో చర్యలు చేపట్టాయి. అయినా కరోనా కేసుల సంఖ్య మూడున్నర లక్షలు దాటింది. అయితే ఈ మహమ్మారికి కళ్లెం వేయడంలో కేరళ సక్సెస్ అవుతోంది. రోగ నిరోధక శక్తిని పెంపొందించుకుని, తద్వారా కరోనాను దూరంగా ఉంచేందుకు కేరళ సర్కార్ ఆయుర్వేదం ఆధారంగా పలు సూచనలు చేస్తోంది. చిరుతిళ్లను వీలైనంత వరకు తగ్గించాలని... డ్రైఫ్రూట్స్‌తో పాటు ఉడికించిన పచ్చి అరటిపండును తీసుకోవాలని సూచిస్తోంది. 
 
రోజులో కనీసం ఒక్కసారైనా ముడి బియ్యంతో చేసిన గంజి తాగాలని... మాంసాహారం తీసుకోకపోతేనే మేలని... కూరలు, సూప్‌లు, అల్పాహారాల్లో పెసలు, పెసరపప్పు విరివిగా వాడాలని పేర్కొంది. రోజుకు 20 నిమిషాలు యోగా చేయాలని... వేడినీటిలో శొంఠిని వేసి మరిగించిన నీటిని తాగుతుండటం వల్ల శ్వాస సంబంధిత సమస్యలు తగ్గుతాయని పేర్కొంది. ఆయుర్వేదం వల్లే కేరళలో కరోనా తగ్గుముఖం పడుతోంది. 
 
కరోనా నియంత్రణకు ఆయుర్వేద మందులు ఉపయోగించేందుకు సిద్ధమైన కేరళ ప్రభుత్వం.. చికిత్స విషయానికి వచ్చేసరికి మాత్రం ఆధునిక వైద్యం పైనే ఆధారపడింది. మరోవైపు దేశంలో గత 24 గంటల్లో 10,974 కొత్త కేసులు నమోదు కాగా 2003 మంది మృతి చెందారు. దేశంలో ఇంత భారీ స్థాయిలో కరోనా మృతుల సంఖ్య నమోదు కావడం ఇదే తొలిసారి. గత 24 గంటల్లో నమోదైన కేసుల వల్ల కరోనా బాధితుల సంఖ్య 3,54,065కు చేరగా మృతుల సంఖ్య 11,903గా ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: