ప్రస్తుతం ఉన్న సమాజంలో మనిషి కన్నా డబ్బుకే విలువలు పెరిగాయి. ఏది చేయాలన్నా డబ్బు ఉండాలి. అయితే డబ్బు విలువ గురించి మధ్య తరగతి కుటుంబం వాళ్లకు బాగా తెలుస్తాయి. అలాంటి కుటుంబాలకు అండగా నిలిచేందుకు ఆదిత్య బిర్లా సన్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్ కొత్త స్కీమ్ తో వచ్చింది. చాల మంది పిల్లలు డబ్బు లేక చదువులు మధ్యలోనే వదిలేస్తున్నారు. మట్టిలో పుట్టిన మాణిక్యం అయినప్పటికీ డబ్బు విషయంలో వారు వెనకడుగు వేయాల్సివస్తుంది. అలాంటి వారిని దృష్టిలో పెట్టుకొని అందుబాటులోకి తీసుకొచ్చారు.

 


పిల్లల ఆర్థిక అవసరాలకు భరోసా కల్పించేందుకు వీలుగా ఆదిత్య బిర్లా సన్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ (ఏబీఎస్‌ఎల్‌ఐ) ‘చైల్డ్‌ ఫ్యూచర్‌ అస్యూర్డ్‌ ప్లాన్‌’ను తీసుకొచ్చింది. పిల్లల జీవితంలో ముఖ్యమైన చదువు, వివాహం ఖర్చులను దృష్టిలో పెట్టుకొని దీన్ని రూపొందించిందన్నారు.

 

 

బీమా పాలసీ తీసుకున్న తల్లిదండ్రులకు ఏదైనా అనుకోనిది జరిగినా.. పాలసీ వ్యవధి తీరేంత వరకూ కొనసాగేలా ప్రీమియం వైవర్‌ ఇందులో ఉందని యాజమాన్యం వెల్లడించారు. వారి లక్ష్యాన్ని చేరుకున్నాక ఒకేసారి చెల్లించడం లేదా 3, 6, 9 ఏళ్లపాటు క్రమం తప్పకుండా డబ్బును వెనక్కి ఇవ్వడం ఐచ్ఛికాలతో ఎంచుకోవచ్చునాని తెలిపారు.

 

 

18-65 ఏళ్ల వయసులో ఉన్న వారు ఈ పాలసీని తీసుకోవచ్చునాని అధికారులు వెల్లడించారు. అయితే గరిష్ఠంగా 75 ఏళ్ల వయసు వచ్చేదాకా ఈ పాలసీ కొనసాగుతుందన్నారు. కనీస వార్షిక ప్రీమియం రూ.30,000. ఎలాంటి గరిష్ఠ పరిమితి లేదన్నారు. ఆదాయం పెరిగినప్పుడు పాలసీ విలువను పెంచుకునే వీలూ కల్పిస్తోందన్నారు.

 

 

అనిశ్చిత పరిస్థితులు నెలకొన్న తరుణంలో పిల్లల ఆర్థిక అవసరాలకు తగిన భరోసా కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. పాలసీ విడుదల సందర్భంగా ఏబీఎస్‌ఎల్‌ఐ మేనేజింగ్‌ డైరెక్టర్‌ కమలేశ్‌ రావు అన్నారు. నిర్ణీత సమయానికి కచ్చితమైన చెల్లింపులను చేసే ఈ పాలసీ అందుకు తోడ్పడుతుందని ఏబీఎస్‌ఎల్‌ఐ మేనేజింగ్‌ డైరెక్టర్‌ కమలేశ్‌ రావు పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: