ఏపీ సీఎం జగన్ తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు సమాజంలో పెను మార్పులు తీసుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో పాలకులు అభివృద్ధి, అభివృద్ధి అంటూ ప్రైవేటు పెట్టుబడులనే ప్రస్తావించేవారు.. పరిశ్రమలు వస్తే గొప్ప.. ఫ్యాక్టరీలు వస్తే గొప్ప.. వ్యాపార ఒప్పందాలు జరిగితే గొప్ప అన్నట్టు ఉండేది పరిస్థితి. కానీ జగన్ సర్కారు తీరు మాత్రం ఇందుకు భిన్నంగా ఉంటోంది. జగన్ పెట్టుబడులు మన సమాజంపైనే ఉంటున్నాయి.

 

IHG

ఇందుకు తాజా ఉదాహరణ.. ఈ బడ్జెట్ లో విద్యారంగానికి కేటాయింపులు. ఈ బడ్జెట్ లో విద్యా రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. సాధారణ విద్యకు బడ్జెట్‌లో 25,201.35 కోట్ల రూపాయలు కేటాయించారు. జగనన్న అమ్మ ఒడి కింద సాయం అందించేందుకు రూ. 6,000 కోట్లు కేటాయించారు. ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక సదుపాయాల కల్పనకు నాడు–నేడు కింద రూ.3,000 కోట్లు కేటాయించారు.

 

IHG

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కాపు, ఈబీసీ, దివ్యాంగ విద్యార్థులకు జగనన్న విద్యా దీవెన, వసతి దీవెనకు అంటే ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు రూ. 5 వేల కోట్లు కేటాయించారు. అంటే మొత్తం మీద కేవలం విద్యారంగానికే పాతిక వేల కోట్ల రూపాయుల కేటాయించారు. ఇది సామాన్యమైన విషయం కాదు. దీని ఫలితాలు ముందు ముందు సమాజంలో కనిపిస్తాయి. గతంలో బడుగు బలహీన వర్గాల చదువుల గురించి ఎవరూ పట్టించుకున్న దాఖలాలు లేవు.

 

IHG'Mana Badi ...

 

కానీ జగన్ సర్కారు మాత్రం.. పేద పిల్లల చదువుల కోసం ప్రాణం పెడుతున్నారు. సర్కారీ బడుల తలరాతలను తిరిగి రాస్తున్నారు. సర్కారు బడుల్లో సౌకర్యాల కోసం కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఈ పెట్టుబడుల ఫలితంగా ఓ తరం బాగా చదువుకుంటుంది. ఒక ఇంట్లో ఒక్కడు బాగా చదివితే ఆ కుటుంబం తరతరాలు బాగు పడుతుంది. అయితే వేల కోట్లు ఖర్చు చేస్తున్న జగన్ సర్కారు అవి సద్వినియోగం అయ్యేలా పకడ్బందీగా ప్రణాళికలు వేసుకోవాలి. పైసా కూడా వృథా కానివ్వకుండా చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: