సాధారణంగా సోషల్ మీడియా అనేది పెద్దగా అవసరం లేని వ్యవహారం అనే విషయం పెద్దగా చెప్పాల్సిన పని లేదు. సోషల్ మీడియాలో చాలా  వరకు రాజకీయ నాయకులు యాక్టివ్ గానే ఉంటూ ఉంటారు గని దాని వల్ల‌ చాల వరకు ఉపయోగం ఉండదు అనేది కొందరి మాట. ఇప్పుడు ఏపీలో తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా మీద ఎక్కువగా ఆధారపడుతోంది. పార్టీ అధినేత చంద్రబాబు నుంచి కింది స్థాయి వరకు అదే పరిస్థితి ఉంది. ఎన్నిక‌ల‌కు ముందు టీడీపీ కేడ‌ర్‌, ఆ పార్టీ సోష‌ల్ మీడియా సైన్యంతో పాటు సీబీఎన్ ఆర్మీ, టీడీపీ సానుభూతి ప‌రులు సోష‌ల్ మీడియాలో విప‌రీతంగా రెచ్చిపోయి పోస్టులు పెట్టారు. దీంతో మిగిలిన వ‌ర్గాలు, కులాల‌ను కూడా వారు టార్గెట్ చేస్తూ వ‌చ్చారు. చివ‌ర‌కు పార్టీ ఘోరంగా ఓడిపోయింది.

 

ఇక ఇప్పుడు పార్టీ ఓడిపోయినా ఎక్క‌డ త‌ప్పులు జ‌రిగాయి ?  ఏం గుణ‌పాఠాలు నేర్చుకోవాల‌న్న‌ది వ‌దిలేసిన బాబోరు సోష‌ల్ మీడియాను బాగా వాడుకోవాల‌ని త‌మ పార్టీ నేత‌ల‌కు నూరి పోస్తున్నార‌ట‌. అగ్ర నేతలు చాలా మంది ఇప్పుడు సోషల్ మీడియా వాడాలి అని చంద్రబాబు నుంచి సంకేతాలు కూడా వెళ్ళాయి అని సమాచారం. విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు చేస్తున్న ఆరోపణలను అదే స్థాయిలో తిప్పి కొట్టాలి అని కొందరు సూచనలు కూడా చేస్తున్నారట టీడీపీ నేతలకు. అయితే ప్రసంగాలను వదిలేసి సోషల మీడియా మీద అంత దృష్టి పెట్టాల్సిన అవసరం ఏంటీ అని పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. 

 

దీని వల్ల‌ ఉపయోగం ఉండే ఉప‌యోగం క‌న్నా న‌ష్ట‌మే ఎక్కువ జ‌రుగుతోంద‌ని.. టీడీప నుంచి అధికార ప‌క్షంపై నిర్మాణాత్మ‌క స్థాయిలో అయితే కౌంట‌ర్లు ప‌డ‌డం లేద‌ని.. ఉత్తుత్తి కామెంట్లు, ద్వేషం పెంచే డైలాగులు త‌ప్పా టీడీపీకి సోష‌ల్ మీడియా వ‌ల్ల పెద్ద‌గా ఒరిగిందేమి లేద‌ని ఆ పార్టీ వాళ్లే చెపుతున్నారు. 
చంద్రబాబు సోషల్ మీడియా మీద అంతగా ఆధార పడితే అంతిమంగా పార్టీ నష్టపోయే అవకాశం ఉంటుంది అని సూచనలు చేస్తున్నారు. మ‌రి బాబు ఇప్ప‌ట‌కి అయినా ఏ మాధ్య‌మాన్ని వాడుకున్నా ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పోరాటాలు.. ప్ర‌భుత్వం చేసే త‌ప్పుల‌ను ఎత్తి చూపేలా వ్య‌వ‌హ‌రిస్తారా ?  రెచ్చ‌గొట్టే ధోర‌ణితోనే మీడియాలో ఉండాల‌ని త‌న కేడ‌ర్‌ను ఎంక‌రేజ్ చేసుకుంటారా ? అన్న‌ది ఆయ‌న ఇష్టం.

మరింత సమాచారం తెలుసుకోండి: