భార్య భారీగా లంచం తీసుకుంది. ఈ కేసులో అరెస్టయింది. ఈ కేసు విచారణ జరుగుతోంది. విచారణ లో భాగంగా భర్తనూ విచారించారు. అంతే.. ఈ పరిణామాలతో కలత చెందాడో ఏమో ఏకంగా భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. అత్యున్నతమైన ఉద్యోగాలు సంపాదించిన దంపతుల జీవితాలు ఇలా విషాదంగా మారాయి. వివరాల్లోకి వెళ్తే.. షేక్‌పేట తహసీల్దార్‌ సుజాత భర్త అజయ్‌కుమార్‌ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ తెల్లవారు జామున ఐదంతస్తుల భవనంపైచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.

 

IHG

 

తీవ్రంగా గాయపడిన అజయ్‌ కుమార్‌ను సమీపంలోని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. తహసీల్దార్‌ సుజాత... లంచం కేసులో ఇప్పటికే అనిశా విచారణ ఎదర్కొంటున్నారు. బంజారాహిల్స్‌ భూ వివాదం కేసులో షేక్‌పేట తహసీల్దార్‌ సుజాత అరెస్టు అయ్యారు. ఖ‌లీద్‌ అనే వ్యక్తి నుంచి లంచం తీసుకున్నట్లు సుజాతపై ఆరోపణలు రావడమే ఇందుకు కారణం.

 

IHG

 

ఆమెను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. విచార‌ణ ఎదుర్కొంటున్న సుజాత ప్రస్తుతం రిమాండ్ లో ఉన్నారు. ఈ కేసు విచారణలో భాగంగా సంబంధించి ఇటీవ‌లే సుజాతను నాంపల్లి ఏసీబీ కార్యాలయానికి పిలిపించారు. ఆమె నివాసంలో ప‌ట్టుబ‌డ్డ రూ.30 లక్షల డబ్బు సహా పలు అంశాలపై ఆరా తీశారు. ఇదే విషయంపై ఉస్మానియా వర్సిటీ ఆర్ట్స్‌ కళాశాలలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న సుజాత భర్తను విచారించారు.

 

IHG

 

ఆయన కూడా పొంతన లేని సమాధానాలు చెప్పినట్టు తెలిసింది. స్థలాన్ని బంధువులకే విక్రయించినందున ఆ లావాదేవీలకు సంబంధించిన పత్రాలు లేవని చెప్పారు. సుజాత ఇంట్లో స్వాధీనం చేసుకున్న పలు ప్రభుత్వ డాక్యుమెంట్లపైనా అధికారులు ఆరా తీశారు. ఈ మొత్తం వ్యవహారంపై కలత చెందారో ఏమో అజయ్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: