ఈ మద్య మనుషులు కృుర మృగాలగా భయంకరంగా తయారవుతున్నారు.  అయితే ప్రపంచం మొత్తం ఇలాగే ఉండదని అనుకుంటే పొరపాటే. ఈజీ మనీ కోసం దొంగతనాలకు ఎగబడే వారి చర్చిస్తే పిచ్చి కోపం వస్తుంది. అయితే దొంగలు కూడా మనుషులే అని వారికీ మానవత్వం ఉంటుందని నిరూపించారు పాకిస్థాన్ కరాచీలో ఓ ఇద్దరు దొంగలు.   ఓ ఇద్దరు దొంగలు దోచుకున్న సొమ్మును తిరిగి ఎవరి వద్దైతే దోచుకున్నారో అతనికే ఇచ్చేశారు.  అంతే కాదు అతని కన్నీరు తూడ్చి హగ్ ఇచ్చి.. షేక్ హ్యాండ్ ఇస్తూ ధైర్యం చెప్పి మరీ పంపారు.  ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. పాకిస్తాన్‌లోని కరాచీలో ఈ సంఘటన చోటు చేసుకుంది. నెటిజన్లు వీరికి పెట్టిన పేరు మంచి దొంగలు. 

 

బైక్‌పై వచ్చిన ఇద్దరు దొంగలు ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ బాయ్‌ను బెదిరించి అతని మనీ పర్స్‌, ఇతర విలువైన వస్తువులు లాక్కున్నారు. అక్కడ నుంచి చిన్నగా జారుకోవాలని చూశారు.. కానీ అక్కడే ఆగి తమ మనసు మార్చుకొని సదరు డెలివరీ బాయ్‌కి ఆ వస్తువులన్నీ తిరిగి ఇచ్చేశారు. దొంగతనానికి వచ్చి అలా ఎందుకు మనసు మార్చుకున్నారన్న విషయానికి వస్తే.. కష్టపడి పని చేసుకుంటూ ఓ డెలివరీ బాయ్ వద్ద ఏముంటుంది.. కాస్త డబ్బు అయితే ఆ డబ్బు కూాడా లాగేసుకోవడంతో ఆ డెలివరీ బాయ్ వారిని ఏమీ అనలేక.. ఎదురు తిరగలేక.. కుమిలి కుమిలి వారి ముందు ఏడ్చాడు. తన చేత్తో కన్నీరు తూడ్చకుంటున్న ఆ డెలివరీబాయ్ ని చూసి ఆ దొంగల మనసు కరిగిపోయింది.

 

పాపం ఎంత బాధలో ఉంటే అలా ఏడుస్తాడని భావించిన ఆ దొంగలు.. దోచుకున్న వస్తువుల్ని తిరిగి ఇచ్చేశారు. అంతేకాదు ‘బాధపడకు.. మమ్మల్ని క్షమించు’ అన్నట్టు అతనికి షేక్ హ్యాండ్, హగ్  ఇచ్చి, అతని కన్నీళ్లు తుడిచి అక్కడినుంచి వెళ్లారు. ఇదంతా సమీపంలోని సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. నిముషం నిడివి ఉన్న ఈ వీడియో సోషల్‌ వీడియోలో తెగ చక్కర్లు కొడుతోంది. నిజంగా మానవత్వం కాస్త బతికే ఉందని అనిపిస్తుందని అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: