చట్టాలు తెలియక దొరికిన బాలుడిని పెంచుకోవడం వలన ముగ్గురు కుటుంబసభ్యులు జైలుపాలయ్యారు. ఇప్పటికి జనాలలో చట్టాల పట్ల అవగాహన కరువైంది. రాతి యుగం నుంచి కంప్యూటర్ యుగం కి చేరుకున్నప్పటికీ మనుషుల ప్రవర్తనలో మార్పు రావడం లేదు. ఆశించే మేధస్సు ఉన్నప్పటికీ దాన్ని ఉపయోగించడం లేదు. వర్షంలో తోడు ఎవరు లేరని కనిపించిన బాలుడిని ఇంటికి తీసుకుని వెళ్ళి పెంచుతారు ఓ దంపతులు. తీరా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అధికారి ఫిర్యాదు మేరకు వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మనిషి ఒకటి అనుకుంటే దేవుడు మరొకటి తలిసీనట్టు పుణ్యానికి పోతే పాపం ఎదురయింది. చివరికి జైలుపాలయ్యారు. ఇక వివరాల్లోకి వెళితే...

 


పటాన్ చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమ దత్తత ఈ విషయంలో ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. లింగంపల్లి కి చెందిన యాకూబ్ అనే ఒక బట్టల వ్యాపారి రోజు విధంగానే గత ఏడాది వినాయక చవితి నాడు పాతపాటలు అమ్మకానికి వృత్తిరీత్యా బయటికి వెళ్లాడు. ఆరోజు హైటెక్ సిటీ సమీపంలో చిన్నపాటి వర్షం లో ఓ చిన్న బాలుడు ఒంటరిగా యాకూబ్ కి కనిపించాడు. చుట్టుపక్కల వెతికిన ఎవరు కనిపించకపోవడంతో ఆ బాలుడిని ఇంటికి తీసుకొని వెళ్ళాడు. యాకుబ్ అతడి భార్య సరోజ కి సంతానం లేకపోవడంతో ఈ బోర్డు ని పెంచుకోవాలని అనుకున్నారు. అనుకున్న విధంగానే ఆ బాలుడిని పెంచుకున్నారు.

 

 

కానీ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అధికారి లోకి ఎంటర్ అవడం వలన మొత్తం కదా తిరిగి పోయింది. అక్రమ దత్తత తీసుకున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ముగ్గురు పైన కేసు నమోదు చేశారు. ఇప్పటికైనా ప్రజల లో కొంత అవగాహన మెరుగవ్వాలి. చాలామందికి ఈ విధంగా పిల్లలు దొరికారని పెంచుకోవడం వలన వచ్చే నేర పరమైన చర్యలు తెలియడం లేదు. ఇప్పటికైనా ప్రజలు మేలుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: