తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ఎప్పుడూ ఏదో ఒక విషయం లో వార్తల్లో ఉంటూనే వస్తున్నారు. ఈటెల రాజేందర్ పై కేసీఆర్ గుర్రుగా ఉన్నారని, ఆయనను మంత్రి పదవి నుంచి తప్పిస్తారు అని పెద్ద ఎత్తున ప్రచారం మొదటి నుంచి జరుగుతున్నాయి. రెండోసారి టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఈటెల రాజేందర్ మంత్రి పదవి దక్కడం చాలా కష్టమని చాలామంది అంచనా వేశారు. కానీ కేసీఆర్ ఆయనకు మంత్రి పదవ కట్టబెట్టారు. టిఆర్ఎస్ ప్రభుత్వం ఆయనకు గత ప్రభుత్వంలో  ఆర్థిక శాఖ మంత్రిగా పదవిని కట్టబెట్టారు. రెండోసారి ప్రభుత్వంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి పదవిని సీఎం కేసీఆర్ కట్టబెట్టారు. టిఆర్ఎస్ పార్టీ విధానంలో కాకుండా, ఈటెల తన సొంత అజెండాతో ముందుకు వెళుతున్నారని కెసిఆర్ ఎప్పటి నుంచో గుర్రుగా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. 

IHG


కెసిఆర్ ఆయనను కలిసేందుకు ఇష్టపడటం లేదని, ఇంకా ఆయన పని అయిపోయింది అంటూ పెద్దఎత్తున ప్రచారం జరిగింది. కానీ అదంతా నిజం కాదు అన్నట్టుగా కేసీఆర్, ఈటెల వ్యవహరిస్తూ వస్తున్నారు. కరీంనగర్ జిల్లాలో కీలక నాయకుడిగా ఉన్న గంగుల కమలాకర్ కు మంత్రి పదవి ఇవ్వడం ద్వారా, రాజేందర్ ను పక్కన పెట్టేందుకు ప్రయత్నం జరిగింది, కానీ ఈ వార్తల్లో ఏ మాత్రం నిజంలేదని ఖండిస్తూ వచ్చారు. తాజాగా కరోనా వైరస్ విజృంభిస్తూ తరుచుగా ప్రభుత్వం విమర్శలపాలవుతున్న నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ చూస్తున్న ఈటెల పూర్తిగా విఫలమయ్యారని, దానికి బాధ్యుడిని చేస్తూ మంత్రివర్గం నుంచి తప్పించాలని కేసీఆర్ చూస్తున్నారని పెద్దఎత్తున ప్రచారం జరిగింది.


 ముఖ్యంగా తెలంగాణలోని గాంధీ ఆస్పత్రి పదే పదే వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారడంతో ఈటెల ను పక్కకు తప్పించి కెసిఆర్ రాజకీయ వ్యూహం నడిపిస్తారని అందరూ ప్రచారం చేస్తుండగా, టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మాత్రం ఈటెల మంత్రి పదవికి ఇప్పట్లో వచ్చిన ముప్పేమీ ఏమీ లేదని, ఆయనను ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించేది లేదని, ప్రస్తుతం కేసీఆర్ ఈటెల మధ్య ఎటువంటి మనస్పర్థలు లేవని, బయట జరుగుతున్న ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదని వారు చెప్పుకొస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: