పట్టుదల ఉంటే అసాధ్యం అనేదే లేదు..  దేశంలో కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. దాంతో చాలా మంది ఇంటిపట్టునే ఉన్న విషయం తెలిసిందే. ఈ సమయంలో కొంత మంది ఖాళీగా కూర్చోకుండా తమకు తగ్గ పనులు చేస్తూ వచ్చారు.  సెలబ్రెటీలు చిత్ర విచిత్రమైన వీడియోలు క్రియేట్ చేసి సోషల్ మాద్యమాల్లో పోస్ట్ చేశారు. ఇటీవల ఒడిశాలోని మహానదిలో కలసిపోయిన గోపీనాథ ఆలయాన్ని పురాతత్వ పరిశోధకులు కనిపెట్టడం తెలిసిందే. అసలు కనిపించదు అన్నకున్న గోపీనాథ ఆలయాన్ని నెటిజన్లు చూడటంతో ఆనందంతో ఉప్పొంగి పోయారు.  తాజాగా నెల్లూరు జిల్లా చేజర్ల మండలం పెరుమాళ్లపాడు సమీపంలో పెన్నా నది గట్టున ఓ ఆలయం ఉందన్న ప్రచారం ఎప్పటి నుంచో జరుగుతూ వచ్చింది. అయితే ఆ విషయం మాటల వరకు మాత్రమే సాగుతూ వచ్చింది.

IHG

కాలగర్భంలో కలసిపోయిన ఆ ఆలయాన్ని కొంతమంది కుర్రాళ్లు పట్టుబట్టి కనిపెట్టారు. ఇసుకమేటల్లో కూరుకుపోయిన ఆలయాన్ని గుర్తించారు. నెల్లూరు జిల్లా చేజర్ల మండలం పెరుమాళ్లపాడు సమీపంలో పెన్నా నది గట్టున్న ఆలయం బయటపడింది.  రెండు వందల ఏళ్ల క్రితం నిర్మించిన ఆలయం ఇసుక మేటల్లో కూరుకు పోయింది.. ఈ విషయం పలు సందర్బాల్లో చర్చలకు వచ్చింది. 

IHG's <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=TEMPLE' target='_blank' title='temple-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>temple</a> Buried In River Sand Unearthed In ...

లాక్‌డౌన్ వల్ల ఖాళీగా ఉన్న కుర్రాళ్లు దాని ఆనవాలు కనిపెట్టడానికి ముందుకొచ్చారు. ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకుని మంగళవారం జేసీబీ యంత్రాలతో ఇసుకను తవ్వారు. వారు ఊహించినట్లే ఇసుక గర్భంలో శివాలయం తొంగిచూసింది. ఆనాటి అద్భుత ఆలయం మళ్లీ చూడటంతో అక్కడి వారి ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: