ప్రపంచ దేశాలను శాసించాలని ప్రయత్నాలు చేస్తున్న చైనాకు వరుస షాకులు తగులుతున్నాయి. కరోనా చైనా సృష్టించిందో లేక అక్కడ జంతువుల నుంచి మనుషులకు వ్యాపించిందో తెలీదు కానీ ఆ వైరస్ డ్రాగన్ దేశంపై ప్రపంచ దేశాలలో వ్యతిరేకత పెంచింది. కరోనా విషయంలో చైనాను, చైనా చెబుతున్న మాటలను ఎవరూ నమ్మట్లేదు. కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య విషయంలో కూడా చైనా వాస్తవాలు చెప్పలేదని చాలామంది బలంగా నమ్ముతున్నారు. 
 
ఇదే సమయంలో పలు దేశాలు చైనాతో ఆర్థికపరమైన సంబంధాలను తెంచుకునే దిశగానే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటికే జపాన్ చైనాతో ఆర్థిక సంబంధాలను తెంచుకుంది. అమెరికా చైనా దేశంలోని కంపెనీలను వెనక్కు రావాలని పిలుపునిచ్చింది. బ్రిటన్ కూడా ఇదే తరహా ప్రకటనలు చేసింది. అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, యూకే, న్యూజిలాండ్ దేశాలు చైనా నుంచి పూర్తిగా వెనక్కు వచ్చేయాలని భావిస్తున్నాయి. 
 
చైనాతో ఎటువంటి వ్యాపార, వాణిజ్య సంబంధాలు పెట్టుకోకూడదని.... అక్కడి నుంచి తరలివచ్చే సంస్థలను ఎక్కడ నెలకొల్పాలనే విషయంలో సమన్వయంతో వ్యవహరించాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. చైనా ఆ దేశాలను వ్యాపార వాణిజ్య సంబంధాలు కొనసాగించాలని కోరినా ఆ దేశాలు మాత్రం వెనక్కు తగ్గడం లేదు. కరోనా సందర్భంలో చైనా ప్రవర్తన వల్లే ఐదు దేశాలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. 
 
తాజాగా చైనా భారత భూభాగాన్ని కబ్జా చేయడానికి ప్రయత్నించడంతో అమెరికా భూభాగాన్ని రక్షణ కోసం భారత్ కు తమ మద్దతు ఉంటుందని ప్రకటించింది. అంతర్జాతీయ మీడియాలో సైతం సోమవారం జరిగిన కాల్పుల గురించి చైనాకు వ్యతిరేకంగానే కథనాలు వెలువడ్డాయి. భవిష్యత్తులో ఇతర దేశాలు కూడా చైనా విషయంలో ఇదే తరహా వైఖరిని అవలంభించే అవకాశాలు ఉన్నాయనీ ప్రచారం జరుగుతోంది. ఇకనైనా చైనా తన వంకర బుద్ధిని మార్చుకోవాల్సి ఉంది.           

మరింత సమాచారం తెలుసుకోండి: