సాధారణంగా మాంసం ప్రియులకు మటన్, చికెన్ కన్నా చేపల కూర అంటే తెగ ఇష్టపడుతుంటారు.   చేపల పులుసు వాసన చూశారంటే తినకుండా ఉండలేం అంటారు చేపలు తినేవారు.. నిజంగా ఆ టేస్ట్ కి ఫిదా అయ్యేవారు చాలా మంది ఉన్నారు. ఇదంతా పక్కన పెడితే సాధారణంగా దొంగతనానికి వచ్చిన వారు ఇల్లు ఖాళీ చేసి అందినంత దోచుకు వెళ్తుంటారు.   ఓ దొంగ మాత్రం దొంగతనానికి వెళ్లిన వాడు ఇంటిని లూటీ చేయకుండా చేపల పులుసుకు ఆశపడి అడ్డంగా బుక్కయ్యాడు.   చేపల పులుసు చూడగానే తన పంట పండిందని పీకల దాక మొక్కి దొంగతనానికి వచ్చిన ఇంటిలోనే హాయిగా నిద్రపోయాడు.  ఎంతగా నిద్ర పోయాడంటే.. ఆ ఇంటి యజమాని వచ్చి స్వయంగా లేవరా నాయనా అంటూ లేపిమరి పోలీసులకు అప్పగించేందగా.. ఈ విచిత్రం తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాలో చోటు చేసుకుంది.

IHG

ఈ విషయం తెలిసిన వారంతా నీ తెలివి తగలెయ్య.. దొంగతనానికి వచ్చి చేపల కూర మెక్కి మరి అడ్డంగా దొరికి పోయావు కదారా అంటూ నవ్వుకుంటున్నారు. సతీస్ అనే యువకుడు ఓ ఇంట్లో దొంగతనం కోసం వెళ్లాడు. ఇల్లంతా తిరిగినా విలువైన వస్తువుల ఏమి దొరకలేదు. వంట గదిలోకి వెళ్లగా అందులో గుమగుమలాడే చేపల పులుసు కనిపించింది.  అప్పటికే మంచి ఆకలి మీద ఉన్న సతీష్ హాయిగా చేపల కూరతో ఆరగించాడు. ఇక ఇంట్లో ఎవరూ లేరు.. ఇక రారు అనుకొని మెల్లగా ఇంటి నుంచి బయటకు వచ్చి మేడపైకి వెళ్లాడు.

 

చల్లగాలి రావడంతో అలిసిపోయి అక్కడే నిద్రపోయాడు. ఉదయాన్నే ఇంటి యజమాని రావడంతో తన ఇంట్లో దొంగతనం జరిగిందని గుర్తించాడు. ఇరుగుపొరుగు వారు వచ్చి సీసీ ఫుటేజీని పరిశీలించగా.. మేడ పై నుంచి పారిపోయిన ఆనవాళ్లు కనిపించాయి. వారంతా పైకి వెళ్లి చూడగా అక్కడే సతీష్ నిద్రపోయి కనిపించాడు. వెంటనే అతనికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఇక మరీ విచిత్రం ఏంటంటే..  సతీష్ ఇంటి నుంచి ఏమి దోచుకోలేదు. దొంగతనానికి వచ్చి చేపల కూరకు కక్కుర్తి పడటంతో కథ అడ్డం తిరిగింది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: