నేడు దేశ స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. దీంతో బెంచు మార్కు సూచీలు చివరకు నష్టాల్లోనే ముగిశాయి. ముఖ్యంగా బ్యాంకింగ్, మెటల్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఎఫ్ఎంసిజి షేర్ల పై అమ్మకాల ఒత్తిడి బాగా కనిపించింది. అంతేకాకుండా చైనా - భారత్ దేశాల మధ్య జరుగుతున్న తీవ్ర ఉద్రిక్తతలకు ఇన్వెస్టర్స్ సెంటిమెంట్ దెబ్బతినడంతో సూచీలను లాభాల్లో మొదలైనప్పటికీ చివరకు నష్టాల్లోనే ముగిశాయి. ఇక నేడు సెన్సెస్ 600 పాయింట్ వరకు పెరగగా నిఫ్టీ కూడా 10000 మార్క్ ను చేరుకుంది. ఇక రోజూ ముగిసేసరికి మాత్రం సెన్సెక్స్ 97 పాయింట్ల నష్టంతో 33508 పాయింట్లు వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 34 పాయింట్ల నష్టంతో 9881 పాయింట్ల వద్ద ముగిసింది.

 

IHG


ఇక నేటి స్టాక్ మార్కెట్ ఒడిదుడుకుల్లో విషయానికి వస్తే.. నిఫ్టీ ఫిఫ్టీ లో మారుతి సుజుకి, భారతి ఎయిర్టెల్, యాక్సిస్ బ్యాంక్, విప్రో, బ్రిటానియా షేర్లు లాభపడగా అందులో మారుతి సుజుకి సంస్థ షేర్లు 4 శాతం పైగా లాభాల బాటపట్టింది. ఇక మరోవైపు mahindra BANK' target='_blank' title='కొటక్ మహీంద్రా-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>కొటక్ మహీంద్రా బ్యాంక్, ఐటిసి, మహీంద్రా అండ్ మహీంద్రా, భారతి ఇన్ఫ్రాటెల్ షేర్లు నష్టపోయాయి. ఇక ఇందులో భారతి ఇన్ఫ్రాటెల్ ఏకంగా నాలుగు శాతం పైగా నష్టపోయింది. 

 

 

అలాగే భారత మార్కెట్లో అమెరికా డాలర్ తో పోలిస్తే భారత రూపాయి మారకపు విలువ స్వల్పంగా నాలుగు పైసలు లాభంతో 76.17 వద్ద ట్రేడ్ కొనసాగుతోంది. అలాగే అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల విషయానికొస్తే బ్రెంట్ ముడి చమురు ధర బ్యారెల్ కు 1.2 శాతం తగ్గి 40. 45 డాలర్లకు చేరుకోగా, డబ్ల్యూటీఏ ముడి చమురు బ్యారెల్ కు 1.67 శాతం క్షీణించగా 37.74 డాలర్లకు చేరుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: