చైనా వస్తువుల గురించి మనందరికీ తెలిసిందే. నాణ్యత లేకపోయినా తక్కువ ధరకే లభ్యమవుతూ ఉండటంతో చైనా వస్తువులపై ఇతర దేశాల ప్రజలు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అయితే రానురాను ప్రజలు క్వాలిటీ వస్తువులకే ప్రాధాన్యత ఇస్తూ ఉండటంతో చైనా మరో కొత్త వ్యాపారం ప్రారంభించడానికి సిద్ధమైనట్టు తెలుస్తోంది. చైనా ప్రారంభించబోతున్న కొత్త వ్యాపారాలలో ఒకటి మెడి టూరిజం. 
 
సాధారణంగా వర్థమాన దేశాలు, వెనుకబడిన దేశాలు ఆయా దేశాలలో సదుపాయాలు లేకపోవడంతో భారత్ దగ్గరకు వైద్యం కోసం వస్తూ ఉంటాయి. అరేబియన్ దేశాలలోని ప్రజలు సైతం చికిత్స కొరకు భారత్ ను ఆశ్రయిస్తారు. ఆ దేశాలతో పోలిస్తే మన దేశంలో వైద్యం ఖరీదు చాలా తక్కువ కాబట్టి ఆయా దేశాల ప్రజలు భారత్ లో చికిత్స కోసం ఆసక్తి చూపిస్తున్నారు. మన దేశంలో ధనవంతులు అమెరికాలాంటి దేశాల్లో చికిత్స కోసం ఎలా ఆసక్తి చూపిస్తారో ఇతర దేశాల ప్రజలు కూడా భారత్ పై అదే విధంగా ఆసక్తి చూపిస్తున్నారు. 
 
చైనా ప్రధానంగా మెడీ టూరిజం ద్వారా శరీర అవయవాలను మార్చే ప్రక్రియను చేపట్టబోతుంది. మన దేశం, ఇతర దేశాలు కిడ్నీ, లివర్ సమస్యలు వస్తే ఇతరుల నుంచి ఆ అవయవాలను కొనుగోలు చేయడాన్ని నేరంగా పరిగణిస్తాయి. బంధువుల నుంచి అవయవాలు తీసుకోవడానికి మాత్రమే పలు దేశాల కోర్టులు అనుమతిస్తాయి. చైనా మాత్రం మెడీ టూరిజం ద్వారా డబ్బులు చెల్లించిన వారికి అవయవాల మార్పిడి చేస్తుంది. 
 
చైనా చొరబాటుదారులను, తిరుగుబాటుదారులను జైళ్లలో బంధించి శిక్షలు వేస్తూ ఉంటుంది. చైనాలో ఎక్కువగా ఉరిశిక్షలు అమలవుతూ ఉంటాయి. అలా చనిపోయిన వారి మృతదేహాల నుంచి అవయవాలను సేకరించి మెడీ టూరిజం ద్వారా చైనా అవయవ మార్పిళ్లు చేస్తోంది. చైనా ఈ విధంగా అవయవాల మార్పిడి చేస్తోందనే ఆరోపణ ప్రధానంగా వినిపిస్తోంది. చైనా అధికారికంగా ప్రకటన చేయకపోయినా అంతర్జాతీయ మీడియాలో మాత్రం చైనా మెడీ టూరిజం గురించి ప్రచారం జరుగుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: