సోమవారం రోజు రాత్రి చైనా సరిహద్దుల్లో ఏం జరిగిందనే దాని గురించి భిన్నాభిప్రాయాలు, భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. 20 మంది భారత సైనికులు ఘర్షణల్లో మృతి చెందగా 48 మంది చైనా సైనికులు చనిపోయారని ప్రచారం జరుగుతోంది. పాంగ్ వాన్ సరస్సు దగ్గర ఉన్న నో మ్యాన్ జోన్ ప్రాంతంలో భారత సైనికులు, చైనా సైనికులు పెట్రోలింగ్ చేస్తున్న సమయంలో పీపుల్స్ లిబరేషన్ పార్టీ ఆర్మీ సైనికులు ప్రతీకారేచ్ఛతో భారత సైనికులపై దాడి చేశారు. 
 
భారత సైనికుల బృందం ఎనిమిది మంది అటువైపుకు వెళ్లిన సమయంలో చైనా సైనికులు శిబిరాల వెనుక దాక్కున్నారని తెలుస్తోంది. వాళ్లు ఉన్నది ఎగువ ప్రాంతం కావడంతో భారత సైనికులకు కనిపించరు. ఆ సందర్భంలో రాళ్లు, ఇనుపరాడ్లతో దాడి చేశారని తెలుస్తోంది. ఆ తరువాత ఇరు దేశాల సైనికుల మధ్య తీవ్రమైన ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఆయుధాలు ప్రయోగించకూడదనే నిబంధనలు ఉండటంతో ఇరు దేశాల సైనికులు తుపాకులు వాడలేదు. 
 
48 మంది చైనా సైనికులు చనిపోయారని ప్రచారం జరుగుతున్నా ఈ సంఖ్య అంతకన్నా ఎక్కువగానే ఉందని తెలుస్తోంది. చైనా సైనికులతో రెండు చైనీస్ మిలటరీ ఆస్పత్రులు నిండిపోయానని తెలుస్తోంది. ఆ ఆస్పత్రుల్లో 70, 80 మంది క్షతగాత్రులు ఉన్నారని 50కు పైగా ఘర్షణల్లో మృతి చెందారనే వాదన వినిపిస్తోంది. అమెరికా నిఘా వర్గాలు మాత్రం 35 మంది చైనా సైనికులు చనిపోయారని చెబుతున్నాయి. 
 
అయితే చైనా మాత్రం విచిత్రమైన ప్రకటనలు చేస్తూ భారత్ పైనే ఆరోపణలు చేస్తోంది. భారత సైనికులే చైనాలోకి చొరబడే ప్రయత్నాలు చేశారని చెబుతోంది. మరోవైపు భారత్ ధీటైన జవాబు ఇస్తామని చెబుతూ ఇప్పటికే పెద్దఎత్తున బలగాలను సరిహద్దుల్లో మోహరించింది. మరోవైపు మోదీ, రాజ్ నాథ్ సింగ్ త్రివిధ దళాలతో, పార్టీ ముఖ్య నేతలతో ఈ అంశాల గురించి సమావేశం నిర్వహిస్తున్నారు. చైనా భారత్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు ఎక్కడికి దారి తీస్తాయో చూడాల్సి ఉంది. అంతర్జాతీయ మీడియా సైతం చైనాదే తప్పు అని చెబుతూ ఉండటంతో డ్రాగన్ దేశం తవ్వుకున్న గోతిలోనే పడిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: