ఈ మధ్య కాలంలో దొంగలు బాగా రెచ్చిపోతున్న విషయం తెలిసిందే. ఎంతో పకడ్బందీగా ప్లాన్ వేసి భారీ చోరీలకు పాల్పడుతున్నారు.  ఒకసారి దొంగతనానికి వెళ్లారు అంటే అందినకాడికి దోచుక పోతున్నారు. ఇక దొంగలు పకడ్బందీగా ఎలాంటి ఆధారాలు లేకుండా చోరీలకు  పాల్పడుతుండటంతో  పోలీసులకు కూడా దొంగలు పట్టుకోవడం పెద్ద సవాలుగా మారింది అని చెప్పాలి. ఇక్కడ ఇలాంటిదే జరిగింది. యూఏఈ లో ముగ్గురు దొంగల ముఠా ఇంట్లో భారీ చోరీకి పాల్పడ్డారు. ఎంతో విలువైన ఆభరణాలను నగదును ఎత్తుకెళ్లారు. వీటి విలువ ఏకంగా ఐదు లక్షల దిర్హమ్ లు  అంటే మన కరెన్సీ లో  1.3 కోట్ల వరకు ఉంటుంది.ఇక బాధితుడు ఈ విషయమై ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు గంటల వ్యవధిలోనే దొంగలను పట్టుకున్నారు. 

 

 గంటల వ్యవధిలోనే దొంగలను పట్టుకుని శభాష్ అనిపించుకున్నారు. శుక్రవారం మధ్యాహ్నం ఈ చోరీ విషయమై ఫోన్ కాల్ వచ్చిందని...బాధితుడు తమ ఆపరేషన్ రూమ్ కి కాల్ చేసి తాను  ఇంట్లో లేని సమయంలో కొందరు దుండగులు చోరీకి పాల్పడ్డారని ఫిర్యాదు ఇవ్వడంతో.. తాము కేసు నమోదు చేసుకున్నట్లు   చెప్పుకొచ్చారు పూజైరాహా  పోలీస్ చీప్  కమాండెంట్ మేజర్ జనరల్ మహమ్మద్ అహమద్.ఇక ఈ కేసును ఛేదించడానికి ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 

 


 ఈ కేసు దర్యాప్తు కోసం ఏర్పాటుచేసిన బృందం గంటల వ్యవధిలోనే చోరీకి పాల్పడిన ముగ్గురు దొంగల ముఠాను అదుపులోకి తీసుకోవడం తో పాటు వారి నుంచి సొమ్మును రికవరీ చేసి బాధితుడికి అందజేసినట్లు తెలిపారు  అధికారులు. అయితే ఈ భారీ చోరీకి పాల్పడిన ముగ్గురు దొంగల ముఠా ఆసియా వాసులుగా  పోలీసులు తేల్చారు. ఈ భారీ దొంగతనం కేసులో గంటల వ్యవధిలో నే దొంగలను పట్టుకున్న పోలీసులు ఉన్నతాధికారులు అభినందించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: