దేశం ఎంతో ఎత్తుకు ఎదిగిందని.. ఎంతోముందడుగు వేస్తుందని నాయకులు అంటుంటారు. ప్రగతి పథంలో మన దేశంలో అన్ని దేశాలతో పోటీ పడుతూ అన్నింటా విజయం సాధిస్తుందని అంటారు.  అంత రిక్షాన్ని సైతం మనం శాసించే స్థాయికి ఎదిగాం... కానీ కుల విక్షను మాత్రం దాట లేక పోతున్నారు.  మతాలు, కుల వివక్షలు మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. కొన్ని రాష్ట్రాల్లో చిన్న కులం.. పెద్ద కులం అంటూ విభజించి పాలిస్తుంటారు నేతలు.  ఇలా తమ వెంట నాయకులు ఉన్నారన్న ధీమా.. ధన బలం ఉన్నవారు చిన్న కులాలు అంటూ వేలెత్తి చూస్తుంటారు.. వారికి ఎదురు తిరిగితే చంపేస్తారు.  ఇలాంటి చిత్రాలు ఎన్నో వచ్చాయి.

 

తాాజాగా ఓ దళితుడు పెళ్లి బారాత్ కోసం గుర్రమెక్కాడని యాదవులు దుర్మార్గానికి పాల్పడ్డారు. పెళ్లి ఊరేగింపును మధ్యలోనే అడ్డుకుని, అతనిపై తీవ్రంగా దాడి చేశారు. మధ్యప్రదేశ్‌లోని ఛతర్‌పూర్‌లో బుధవారం ఈ కుల అమానుషకాండ జరిగింది. సతాయ్ ప్రాంతానికి చెందిన దళితుడు పెళ్లి ఊరేగింపులో గుర్రమెక్కాడు. తమకన్నా తక్కువ కులం వాడు.. ఇంత ఆనందంగా తమ ముందే గుర్రమెక్కి ఢాంబికాలకు పోతాడా అని జీర్ణించుకోలేని యాదవులు గుర్రం కళ్లెం లాగి అతణ్ని కింద పడేశారు.

 

దళితులు గుర్రమెక్కారని, కోరమీసం పెట్టుకున్నారని, చివరకు తమ ముందు చెప్పులతో నడిచారంటూ ఉత్తరాదిలో అగ్రవర్ణాలు తరచూ దాడులు దిగుతున్నాయి. బీసీల కిందికి వచ్చే యాదవుల్లో కొందరు తాము దళితులకంటే అధికులమనే అహంకారంతో దాడులకు పాల్పపడుతుంటారు. నిందితులపై చర్యలు తీసుకుంటామని ఎస్ఐ దీపక్ యాదవ్ చెప్పాడు. ప్రస్తుతానికి నలుగురిని అరెస్ట్ చేశామన్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: