రాను రాను 'రైతు బంధు' పథకానికి పులిస్టాప్ పడే అవకాశం ఉన్నట్లు తాజా షరతులతో రైతు సంఘాలు లోలోపల చర్చించుకుంటున్నారు. రైతులకు ఇంత చేస్తున్నాం అంత చేస్తున్నాం అని చెప్పుకునే తెలంగాణ ప్రభుత్వం రైతుల పై నిర్లక్ష్యం వహించే విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నట్లు రైతు సంఘాల నేతలు భావిస్తున్నారు. ఇప్పటికే పాస్ పుస్తకాలు లేవని కొందరికి పాస్ పుస్తకాలు ఉన్నాగాని వివిధ సాకులతో మరికొందరికి రైతుబంధు ఇవ్వటం లేదని ఎప్పటినుండో విమర్శలు ప్రభుత్వంపై వస్తున్నాయి. ఇదిలా ఉండగా తాజాగా రైతుబంధు అమలు కోసం రాష్ట్ర మరియు జిల్లా స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం రెడీ అయ్యింది.

 

ఈ నేపథ్యంలో 'రైతుబంధు' పథకం వర్తించాలి అంటే కొన్ని ఆంక్షలు పెట్టింది కేసీఆర్ సర్కార్.  2020 జనవరి 23న సీసీఎల్ఏ జాబితాలోని పట్టాదార్లకు మాత్రమే రైతుబంధు పథకం అమలు చేయాలని డిసైడ్ అయినట్లు టాక్. అంతేకాకుండా ప్రభుత్వం చెప్పినా పంటను వేసిన రైతులకే రైతుబంధు పథకాన్ని అమలు చేయాలని టిఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ రాష్ట్రంలో ఏ రైతు అయితే టిఆర్ఎస్ ప్రభుత్వం ఆ భూమిలో ఏ పంట వెయ్యాలో చూపిస్తుందో ఆ పంట వెయ్యటానికి అంగీకరించిన రైతుకు మాత్రమే 'రైతుబంధు' పథకం అమలు అవుతోందని నిర్ణయించింది.

 

ఈ తరుణంలో తెలంగాణ రైతులు 'రైతుబంధు' కార్యక్రమం పేరట రాష్ట్రంలో ఉన్న రైతులను కేసీఆర్ సర్కార్ గందరగోళానికి గురి చేస్తోందని ఆరోపిస్తున్నారు. ముందస్తు ఎన్నికల టైంలో రాష్ట్రంలో ఉన్న రైతులందరికీ డబ్బులు జమ చేసిన కేసీఆర్ ఇప్పుడు ఈ విధంగా వ్యవహరించడాన్ని తీవ్రస్థాయిలో తప్పుబడుతున్నారు. మొత్తంమీద కేసీఆర్ ప్రభుత్వం రైతుబంధు కార్యక్రమం కోసం కొత్త కొత్త షరతులు తెరపైకి తేవడం పట్ల రైతులు తీవ్రస్థాయిలో ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: