భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కరోనా వైరస్ నివారణ చర్యలపై సలహాలు, సూచనలు మరియు విశ్లేషణ కొరకు అన్ని దేశాల రాష్ట్ర ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన విషయం తెలిసిందే.

 

రాష్ట్రంలో ప్రస్తుతం అమలవుతున్న లాక్ డౌన్ విధి విధానాల గురించి, కరోనా వైరస్ ప్రభావం రాష్ట్రంలో ఏ విధంగా ఉన్నది.... రాష్ట్రంలో ప్రస్తుతం అమలవుతున్న లాక్ డౌన్ విధి విధానాల గురించి, కరోనా వైరస్ ప్రభావం రాష్ట్రంలో ఏ విధంగా ఉన్నది. ఇలా అనేక విషయాల గురించి మోడీ ముఖ్యమంత్రులను అడిగి తెలుసుకున్నారు. 

 

రోజురోజుకీ పరిస్థితి విషమిస్తున్న నేపథ్యంలో భవిష్యత్తులో దేశ కార్యాచరణపై వీరంతా సుదీర్ఘంగా చర్చించుకున్నారు. అయితే ఇదే సమయంలో రోజు పదివేలకు పైగా కేసులు నమోదు అవుతూఉండడంతో ప్రజలంతా కేంద్ర ప్రభుత్వం మళ్లీ పూర్తిస్థాయిలో లాక్ డౌన్ ను విధించేందుకు సన్నాహాలు జరుపుతోంది అని భావించారు.

 

ఇదే విషయమై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.... నరేంద్ర మోడీ ని వివరణ అడగగా మోదీ ఎట్టి పరిస్థితుల్లో మళ్లీ  లాక్ డౌన్ ను పూర్తి స్థాయిలో విధించే అవకాశం లేదని తేల్చి చెప్పారు. ఇప్పుడు మనం అన్ లాక్ 1.0 లో ఉన్నామని ఇక అన్ లాక్ 2.0 లో జరగవలసిన పనుల గురించి ఆలోచించాలని స్పష్టం చేశారు.

 

ఇక రోబోయే రోజులు అన్నీ అన్ లాక్ మోడ్ లోనే ఉంటాయి కాబట్టి అంతర్రాష్ట్ర సరిహద్దులను తెరిచే అవకాశాలు మెండుగా ఉన్నాయని విశ్లేషకులు అనుకుంటున్నారు. ఇక రాబోయే రోజుల్లో ఇప్పుడున్న వాటికన్నా…. రెట్టింపు కేసులకి కూడా అంతా రెడీ అయిపోవాల్సిందే ఏమో.

మరింత సమాచారం తెలుసుకోండి: