వైఎస్ జగన్ యువ నేత. ఆయనకు ఏమీ తెలియదు అనుకుంటే ఎవరైనా పొరపడాల్సిందే. జగన్ పదేళ్ల రాజకీయం చూసిన తరువాత కూడా అలా ఆలోచిస్తే షాక్ తినాల్సిందే.   జగన్ తాను అన్న మాటకు కట్టుబడి ఉంటారు. దాని కోసం ఆయన ఎందాకైనా వెళ్తారు.  నిజానికి జగన్ రాజకీయంలో తగ్గడం అన్నది లేదు అంటారు.

 

ఇక ఆయన  ముఖ్యమంత్రి అయ్యాక  కేంద్రంతో సయోధ్యగా ఉంటూ వస్తున్నారు. దానికి కారణాలు ఉన్నాయి. ఏపీ ఇబ్బందులో ఉంది. రాష్ట్రం అన్ని విధాలుగా ముందుకుపోవాలంటే కేంద్ర సాయం అవసరం. ఘర్షణలు పడితే ప్రజలు ఇక్కట్లు పడతారు. అందుకే ఆయన మోడీకి కేంద్రంలో కొన్ని అంశాల్లో మద్దతు ఇస్తున్నారు.

 

అలాగని అన్ని విషయాలు అలాగే అనుకుంటే కుదరదు అని జగన్ నిక్కచ్చిగా తేల్చిచెప్పేశారు. దానికి అచ్చమైన ఉదాహరణే ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌కు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయడం. ఈ రోజు శాసనసభ ఈ తీర్మానం చేయడం ద్వారా దేశంలో బీజేపీని ఈ అంశాల్లో వ్యతిరేకిస్తున్న రాష్ట్రాల్లో ఒకటిగా నిలిచింది. 

 

ఈ రెండు బిల్లులూ బీజేపీ వరకూ చూస్తే ఎంత ప్రాణ సమానమో అందరికీ తెలిసిందే. కరోనాకు ముందు బడ్జెట్ సమావేశాలను మొత్తానికి మొత్తంగా గందరగోళం చేసిన ఈ రెండు బిల్లుల విషయంలో ఏపీ సర్కార్ నిర్ణయం కోసం కూడా అంతా ఎదురుచూశారు. ఎందుకంటే లోక్ సభలో నాలుగవ అతి పెద్ద పార్టీగా ఉంది. అలాగే రాజ్యసభ‌లో తొందరలో ఆరు మంది ఎంపీలు కూడా వైసీపీకి వస్తారు.

 

ఇవన్నీ చూసుకున్నపుడు వైసీపీ తమకు సానుకూలంగా కలసి వస్తుందని బీజేపీ ఆశలు పెట్టుకోవచ్చు కానీ అవన్నీ వట్టివేనని, తాము మైనారిటీ పక్షమేనని వైసీపీ పక్కా క్లారిటీగా చెప్పేసింది. అంతే కాదు. తన పార్టీ పునాదులను కూడా పటిష్టపరచుకుంది. మొత్తానికి ఈ తీర్మానం మాత్రం బీజేపీకి షాక్ లాంటిదేనని చెప్పాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: