నర్సాపురం పార్లమెంటు సభ్యుడు రఘురామకృష్ణంరాజు వ్యవహారం వైసిపి పార్టీ హైకమాండ్ కి పెద్ద తలనొప్పిగా మారింది. మొదటి నుండి వైయస్ జగన్ పద్ధతి పట్ల ఎంపీ రఘురామకృష్ణంరాజు అభ్యంతరం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఇటీవల అచ్చెన్నాయుడు అరెస్ట్ వ్యవహారం మరియు జగన్ తీసుకున్న కొన్ని నిర్ణయాలపై బహిరంగంగానే రఘురామకృష్ణంరాజు విమర్శలు చేయడం జరిగింది. దీంతో ఉన్న కొద్ది శృతిమించడంతో రఘురామ కృష్ణం రాజు పై సొంత జిల్లా నేతలు విమర్శలు చేయడం స్టార్ట్ అయింది.

IHG

అయినాగాని రఘురామకృష్ణంరాజు ఎక్కడ వెనుకడుగు వేయకుండా తన ని విమర్శించిన ఐదుగురు ఎమ్మెల్యేలను ఉద్దేశించి...‘సింహమే సింగిల్‌గా వస్తుంది.. పందులే గుంపుగా వస్తాయి..’ అంటూ తనదైన స్టయిల్లో కౌంటర్ ఇచ్చారు. ‘బస్తీ మే సవాల్‌.. దమ్ముంటే రాజీనామా చెయ్‌..’ అని ఆ ఎమ్మెల్యేలు సవాల్‌ విసిరితే, ‘నేను రాజీనామా చేస్తాను.. నాతోపాటు మీరూ రాజీనామా చెయ్యండి.. ఎవరి సత్తా ఎంతో తేలిపోతుంది..’ అంటూ ప్రతి సవాల్‌ విసిరారు ఎంపీ రఘురామకృష్ణంరాజు. ఈ విధంగా సొంత ఎంపీ వ్యవహరించడం పార్టీలో పెద్ద చర్చకు దారితీసింది.

IHG

కావాలని పార్టీ నుండి సస్పెండ్ అవ్వటానికి రఘురామకృష్ణంరాజు ఆడుతున్న పొలిటికల్ గేమ్ అని భావిస్తున్నారు. పార్టీ ఫిరాయింపుల చట్టం అడ్డు వస్తుంది కాబట్టి నేరుగా హైకమాండ్ విమర్శించుకొన్ని పార్టీ నుండి సస్పెండ్ అయితే..తాను కోరుకున్నటు ఇతర పార్టీలో చేరే అవకాశం ఉంటుందని...అందుకన్నే పార్టీ ని విమర్శిస్తున్నారని ఎంపీ  వ్యవహరిస్తున్న తీరుపై వైసీపీ నేతలు అంతర్గత డిస్కషన్ లో చర్చించుకుంటున్నారు అని వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా రఘురామకృష్ణంరాజు బీజేపీ పార్టీ లోకి వెళ్ళటానికి ఈ విధంగా వ్యవహరిస్తున్నారని అందరూ భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: