ప్రపంచ దేశాలను కరోనా వైరస్ చిగురుటాకులా వణికిస్తోంది. కరోనా వైరస్ పుట్టుకకు కారణమైన చైనాపై ఈ వైరస్ వల్ల వ్యతిరేకత పెరుగుతోంది. దీంతో చైనాలోని కంపెనీలు భారత్ తో పాటు ఇతర దేశాలకు వైపు ఆసక్తి చూపిస్తున్నాయి. చైనా ఆ కంపెనీలను అక్కడే ఉండాలని కోరుతున్నా ఆ కంపెనీలు మాత్రం ఆ దేశం మాట వినట్లేదు. ఇప్పటికే 5 దేశాలకు సంబంధించిన సంస్థలు సొంత దేశాలకు వెళ్లేందుకు సిద్ధమయ్యాయి. 
 
అతి చిన్న దేశమైన వియత్నాంకైనా వెళతాం కానీ చైనాలో మాత్రం ఉండబోమని ఖరాఖండీగా చెబుతున్నాయి. భారత్ చైనా నుంచి భారత్ కు కంపెనీలను రప్పించటానికి ఒక వైపు ప్రయత్నాలు చేస్తోంది. దేశంలోని వివిధ రాష్ట్రాలు తమ ప్రతిపాదనలను కేంద్రానికి ఇవ్వడం.... కేంద్రం కూడా ప్రోత్సాహకాలు, అనుమతులు ఇచ్చి కంపెనీలను భారత్ కు తమ వంతు ప్రయత్నాలు చేస్తూ ఉండటం గమనార్హం. 
 
ప్రముఖ ఆర్థికవేత్త జిల్ వోనిల్ భారత్ కు కంపెనీలను అందిపుచ్చుకోగల శక్తి ఉందని చెబుతున్నాడు. అంతర్జాతీయంగా అమెరికా కూడా తన ప్రాబల్యాన్ని కోల్పోతూ ఉందని... అందువల్ల పెట్టుబడిదారులు అగ్రరాజ్యంలో పెట్టుబడులు పెట్టాలన్నా అపనమ్మకంతో ఉన్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. లోకల్ గా పెరుగుతున్న ఉద్యమాలను కంట్రోల్ చేయలేకపోవడం కూడా అమెరికాకు మైనస్ గా మారుతోంది. 
 
అమెరికా లాంటి దేశాల్లో కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ కావడం వల్ల పారిశ్రామికవేత్తలు ఇతర దేశాలవైపు వెళ్లడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇలాంటి సమయంలో భారత్ గృహ నిర్మాణం, విద్యారంగం, ఆరోగ్య రంగాలలో సంస్కరణలు వేగవంతం చేయాల్సి ఉంది. ప్రాక్టికల్ నాలెడ్జ్ పెంచడం.... తక్కువ ధరకే ఇళ్లు లభ్యం కావడం... హెల్త్ ఇన్సూరెన్స్ లాంటి సౌకర్యాల మార్పులు చేస్తే ప్రపంచంలో నంబర్ 1 స్థానానికి భారత్ ఎదిగే అవకాశం ఉందని చెబుతున్నారు.             

మరింత సమాచారం తెలుసుకోండి: