ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ముందు నుండి వైసీపీ పార్టీపై దూకుడుగా వ్యవహరించే పార్టీ జనసేన పార్టీ. 2014 ఎన్నికలు మొదలు నాటి నుండి పవన్ కళ్యాణ్ వైసీపీ పార్టీని ప్రతీ విషయంలో టార్గెట్ చేస్తూ ఏపీ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించడం జరిగింది. జగన్ ప్రతిపక్షంలో ఉన్న అధికారంలో ఉన్నా గాని పవన్ టార్గెట్ మాత్రం మారలేదు. అంతెందుకు వైయస్ జగన్ అధికారంలోకి వచ్చాక ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీ కంటే ఎక్కువగా పోరాడింది పవన్ కళ్యాణ్ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. జగన్ అన్నా వైసీపీ పార్టీ అన్నా పవన్ కళ్యాణ్ అభిమానులకు జనసేన పార్టీ కార్యకర్తలకు భయంకరమైన విద్వేషం. అటువంటి వైసీపీ పార్టీ పై పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి.

 

పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వైసీపీ పై పోరాడుతుంటే నాగబాబు చేస్తున్న వ్యాఖ్యలు పార్టీ పరువు తీసే విధంగా ఉన్నాయి అని జనసేన పార్టీలో కార్యకర్తలు అంతర్గత డిస్కషన్స్ పెట్టుకుంటూన్నారట. ఇటీవల బాలయ్య బాబు భూములు పంచుకుంటున్నారు అని చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు టైములో ఓ ప్రముఖ టీవీ ఛానల్ కి నాగబాబు ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఆ సమయంలో అటు సినిమా రంగంపై ఇటు రాజకీయ రంగంపై నాగబాబు తనదైన శైలిలో వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ టైంలో వైయస్ జగన్ ని రాజకీయంగా మాత్రమే విభేదించడం జరుగుతుంది. కానీ అతని పరిపాలన చాలా బాగుంది. వైద్యరంగంలో ఆయన తీసుకున్న కొన్ని నిర్ణయాలు ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉన్నాయని నాగబాబు స్వయంగా అభినందించడం జరిగింది. ఆ తరువాత టీడీపీ పార్టీకి మద్దతు తెలిపే చానల్స్ విషయంలో విళ్లకి జగన్ అయితేనే కరెక్ట్ మొగుడు అంటూ నాగబాబు ఘాటుగా కామెంట్లు చేయడం జరిగింది.

 

ఇదిలా ఉండగా ఇటీవల తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్టు వ్యవహారంలో పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తుంటే నాగబాబు మాత్రం… తెలుగుదేశం పార్టీ అప్పట్లో అధికారంలో ఉన్న సమయం లో జనసేన పార్టీ కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేశారు. ఆ ఉసురు ఇప్పుడు గట్టిగా తగిలింది అనుభవించండి అని స్పందించారు. ఇదే టైమ్ లో మరి కాకినాడ లో వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి…అనుచరులు పార్టీ కార్యకర్తలపై దాడి చేస్తే అప్పుడు ఎందుకు స్పందించలేదు అని సొంత పార్టీ కార్యకర్తలు నాగబాబు ని ప్రశ్నిస్తున్నారట. మరి కొంతమంది వీరాభిమానులు అయితే నాగబాబు జన్మలో తలెత్తుకోలేని విధంగా గట్టిగా స్ట్రోక్ ఇచ్చారు. నాగబాబు జనసేన పార్టీలో వైసీపీ కోవర్టుగా వ్యవహరిస్తున్నారని సోషల్ మీడియాలో ఆయన వ్యవహరించిన తీరుపై కామెంట్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: