అవును.. యాప్స్ డిలీట్ చేస్తాం.. కానీ చైనా ఫోన్ ఏం చెయ్యాలి అని మీకు సందేహం రావచ్చు. అయితే ఫోన్ తరువాత అయినా మార్చే అవకాశం ఉంది కానీ ఫస్ట్ అయితే మన ఫోన్ లో ఉండే యాప్స్ ను డిలీట్ చెయ్యాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకుంటున్నారా? మీకు తెలుసు కదండీ! చైనాకు సంబంధించిన యాప్స్ వాడితే డేటా చైనాకు తరలిపోతోంది అని గత కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి కదా! 

 

అయితే కొన్ని చైనా యాప్స్‌ సంస్థలు అలాంటివి ఏం లేవు అంటూ చెప్పుకొచ్చారు. కానీ అలాంటి సందేహాలున్న 50కి పైగా యాప్‌ల జాబితాను భారత ఇంటెలిజెన్స్‌ వర్గాలు సూచించింది. ఇందులో జూమ్‌, టిక్‌టాక్‌, యూసీ బ్రౌజర్‌, షేర్‌ ఇట్‌, క్లీన్‌ మాస్టర్‌ లాంటి యాప్స్  ఉన్నాయి. ఆ యాప్స్‌ ని వెంటనే డిలేట్ చెయ్యాలి అని.. వీలైతే భారత్ వాటిని నిషేధించాలని కోరుకుంటున్నారు. 

 

ఇంటెలిజెన్స్‌ వర్గాలు సూచించిన యాప్స్ ఇవే!

 

టిక్‌టాక్‌, వొల్ట్‌-హైడ్‌, విగో వీడియో, బిగో లైవ్‌, వీబో, విచాట్‌., షేర్ఇట్‌, యూసీ న్యూస్‌, యూసీ బ్రౌజర్‌, బ్యూటీ ప్లస్, జెండర్‌, క్లబ్‌ ఫ్యాక్టరీ, హలో, లైక్‌, క్వయ్‌, రోమ్‌వీ, షిఇన్‌, న్యూస్‌ డాగ్,‌ ఫొటో వండర్‌, మెయిల్‌ మాస్టర్‌, ఎంఐ వీడియో కాల్‌- షావోమీ, పార్లల్‌ స్పేస్‌, వీసింక్‌, సెల్ఫీసిటీ, క్లాష్‌ ఆఫ్‌ కింగ్స్‌, ఏపీయూఎస్‌ బ్రౌజర్‌, వివా వీడియో-క్యూయూ వీడియో ఇంక్‌, పర్‌ఫెక్ట్‌ క్రాఫ్‌.

 

సీఎం బ్రౌజర్‌, వైరస్‌ క్లీనర్ (హై సెక్యూరిటీ ల్యాబ్‌), ఎంఐ కమ్యూనిటీ, డీయూ రికార్డర్‌, యూక్యామ్‌ మేకప్, ఎంఐ స్టోర్, 360 సెక్యూరిటీ, డీయూ బ్యాటరీ సేవర్, డీయూ బ్రౌజర్‌, డీయూ క్లీనర్‌, డీయూ ప్రైవసీ, క్లీన్‌ మాస్టర్-చీతా, క్యాచీ క్లియర్‌ డియూ యాప్స్‌ స్టూడియో, బైదూ ట్రాన్స్‌లేట్‌, బైదూ మ్యాప్, వండర్‌ కెమెరా, ఈఎస్‌ ఫైల్‌ ఎక్స్‌ప్లోరర్‌, క్యూక్యూ ఇంటర్నేషనల్, క్యూక్యూ లాంచర్, క్యూక్యూ సెక్యూరిటీ సెంటర్‌, క్యూక్యూ ప్లేయర్, క్యూక్యూ మ్యూజిక్‌, క్యూక్యూ మెయిల్, క్యూక్యూ న్యూస్‌ ఫీడ్. చూసారుగా.. ఈ యాప్స్ మీ ఫోన్స్ లో ఉంటే వెంటనే డిలీట్ చెయ్యండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: