డ్రాగాన్ కి ఇపుడు బెదురు పట్టుకుంది. ఇంతకాలం పై పైన చేసిన అరాచకాలు, అక్రుత్యాలు ఒక ఎత్తు. ఇపుడు మాత్రం ఎక్కడ భారత్ ని టచ్ చేయాలో అక్కడ టచ్ చేసింది. మోడీ సర్కార్ ని తట్టిలేపింది. ఇపుడు  భారత్ లో మోడీ అంతర్జాతీయ నాయకుడిగా ఉన్నాడు. చైనా నూతిలో కప్పలా చుట్టుపక్కల పేద దేశలను మచ్చిక చేసుకుని కుట్ర బతుకు వెళ్లదీస్తోంది.

 

ఇపుడు భారత్ కనుక తలచుకుంటే చైనా పీచమణ‌చడం ఖాయం.  కాని టైంలో బ్యాడ్ టైంలో చైనా పెట్టుకుని పెట్టుకుని మరీ మోడీతోనే పెట్టుకుంది. దానికి తగిన ప్రతిఫలం అనుభవిస్తుంది అంటున్నారు. మోడీ అంటే ఏంటో ఇపుడు చైనా కళ్లారా చూస్తుందని అంటున్నారు.

 

చైనాకు గుండెల్లో గుబులు మొదలైందని ఆ దేశ అధికార ప్రతినిధుల మాటల్లోనే వ్యక్తం అవుతోంది. భారత్ ఈ వ్యవహరాన్ని ఇంతటితో వదిలిపెట్టాలని  చైనా అంటోంది. ఇది పెద్దది చేయవద్దు అని కూడా కోరుతోంది. దాన్ని నమ్మి సరేనన‌డానికి ఇది 1962 కాదు, అనాడు అమాయకంగా మోసపోయిన నాటి పాలకులూ, నాటి  భారతీయులు అంతకంటే కాదు, ఇపుడు మోడీ ఉన్నారు. చైనాకు ఎలా జవాబు చెప్పాలో అలాగే చెబుతారు అంటున్నారు.

 

చైనా చాలా తప్పులు చేసింది, అందులో అతి పెద్ద తప్పు భారత్ ని ఇలా  కెలకడం. ఇపుడు దానికి తగిన గుణపాఠం చైనా త్వరలోనే  అందుకోబోతుందని రాజకీయ నిపుణులు సైతం అంటున్నారు. చైనా ఆర్ధిక పరిస్థితి కూడా ఇపుడు దుర్బరంగా ఉంది. భారత్ యుధ్ధం అంటే చచ్చాం అనేలాగే చైనా ఉంది. కానీ చైనా పైకి బింకం పోతోంది. భారత్ ఊరుకుంటే కవ్వించడం. కళ్ళెర్రచేస్తే ఆగినట్లుగా నటించడం, ఈ నంగనాచితనానికి కపటనాటకానికి మోడీ గట్టి ముగింపు పలకబోతున్నారు.

 

భారత్ కి సాయంగా ఇపుడు అనేక దేశాలు కూడా ఉన్నాయి. ఒక విధంగా చెప్పాలంటే ఈ ప్రపంచంలో చైనా ఒంటరిది. అదే మళ్ళీ రుజువు అవుతోంది. మోడీ గట్టి షాక్ తరువాత మరింత తెలిసివస్తుంది కూడా.

 

మరింత సమాచారం తెలుసుకోండి: