చంద్రబాబు ఎపుడూ రాజకీయాల్లో వాటాలు గట్టిగా కోరుకుంటారు. ఆయన్ హైదరాబాద్ వదిలేసి వస్తున్నపుడు కేసీయార్ని ఉద్దేశించి ఒక మాట అన్నారు. మీకు ఏసీబీ ఉంటే మాకూ ఏసీబీ ఉంది అని నాడు బాబు గట్టిగా అన్నారు.  అంటే ఎవరి విషయంలోనూ ఎక్కడా బాబు తగ్గరన్నమాట. ఇపుడు అసెంబ్లీలో వైసీపీకి బలం ఉంది. అక్కడ తెలుగుదేశం జీరో, మరి మండలిలో అయితే టీడీపీకి కచ్చితమైన బలం ఉంది. మెజారిటీ వారిదే. దాంతో మండలి మాదీ అంటోంది పచ్చ పార్టీ.

 

ఈ రాజకీయ అహంకారం, దుర్నీతి ఎంతదాకా వెళ్తోందంటే చట్టసభలు రెండూ ఒక్కటి అన్న భావన నుంచి రెండు వేరు వేరు పార్టీలవి  అన్న తీరుకు తీసుకుపోతోంది. ఆరు నెలల క్రితం జరిగిన మండలి ప్రహసనం అంతా చూశారు. నిజానికి మండలి ఉన్నది అసెంబ్లీ చేసిన బిల్లులను మరో మారు చర్చించి  ఏమైనా పొరపాట్లు ఉంటే సవరించి పంపించడం, లేకపోతే యధాతధంగా అమోదించడం. అయితే ఇపుడు  సమాంతర ప్రభుత్వాన్ని మండలి నుంచి నడపాలని టీడీపీ నిర్ణయించుకోవడంతో  రాజ్యాంగ వ్యవస్థలు అయిన అసెంబ్లీ, కౌన్సిల్ ఒకదాన్ని ఒకటి ఢీ కొట్టడానికి కారణం అవుతున్నాయి.

 

నిజానికి రెండింటినీ కలిపే ఒకటిగా చూడాలి. చెక్ అండ్ బ్యాలన్స్ కోసం మాత్రమే పెద్దల సభను ఉంచారు. దీని మీద రాజనీతి కోవిదుల మాటల్లో చెప్పాలంటే వేడిగా ఉండే కాఫీని ఎవరూ తాగలేరు. దాన్ని కాసేపు చల్లారబెట్టి తాగుతారు. అంటే ఒక్కోసారి ఆవేశంతో చేసే నిర్ణయాలు మండలిలో చర్చించి వాటి లోతుపాతులను చూస్తాయన్న మాట. 

 

అంటే చాలా విచక్షణతో వివేకంతో పనిచేయాల్సిన మండలి ఇపుడు ఆ పరపతిని కోల్పోయేలా రాజకీయాలు చోటు చేసుకోవడం దారుణమే. మీకు అసెంబ్లీ ఉంటే మాకు మండలి ఉంది అంటూ చంద్రబాబు అంటున్నారన్నమాట. సరే రాజకీయాలు అంటే పార్టీలుగా చూసుకోవాలి. ద్రవ్య వినిమయ బిల్లుని ఎటువంటి బద్ద వ్యతిరేక పార్టీ అయినా ఆమోదిస్తుంది. ఈసారి శాసనమండలిలో మాత్రం ద్రవ్య వినిమయ బిల్లుని సైతం ఆమోదించకుండా వాయిదా వేసి వెళ్ళిపోవడం అంటే దారుణమే.

 

ఇది దేశ చరిత్రలో ఇప్పటిదాకా జరగని విషయం. వచ్చే నెలకు జీతలు రాక రాష్ట్రం అంతా స్థంభిస్తుంది. . అంతే కాదు, ఒక్క పైసా కూడా ఖజానా నుంచి ఖర్చు చేయడానికి ఉండదు. ఇది దారుణమే. బడ్జెట్ ని ఆమోదించని సభగా మండలిని మార్చ‌డం అంటే రాజకీయాలు పతనానికి చేరుకున్నాయని చెప్పాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: