కేసీఆర్ సర్కార్ ఇచ్చిన 111 జీవోకు వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి అప్పట్లో పోరాటం చేయడం అందరికీ తెలిసినదే. విడుదలైన ఈ జీవో ఆధారంగా కేటీఆర్ ఫామ్ హౌస్ అక్రమంగా కట్టారు అని రేవంత్ రెడ్డి భయంకరమైన తెరాస ప్రభుత్వం పై విమర్శలు చేస్తూ పోరాటం కేసీఆర్ సర్కార్ పై చేయటంతో ఈ విషయంలో టిఆర్ఎస్ నేతలు కూడా ఘాటుగానే సీరియస్ అయ్యారు. ఆ తర్వాత కొన్నాళ్లకు ఈ విషయంలో టిఆర్ఎస్ పార్టీ నేతలు సైలెంట్ అయిపోయారు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం కేటీఆర్ ని టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తూనే ఉన్నాడు. కానీ టిఆర్ఎస్ పార్టీ నేతల నుండి స్పందన రావడం లేదు. దీంతో రేవంత్ ఎన్ని విమర్శలు చేసిన కేసీఆర్ పార్టీ నాయకులు ఎందుకు స్పందించడం లేదన్న తెలంగాణ రాజకీయాల్లో బలంగా నడుస్తోంది.

 

ఇదిలా ఉండగా  టిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో విడుదలైన 111 జీవో ఆధారంగా ఎక్కువగా  హైదరాబాద్ నగరంలో అక్రమంగా నిర్మాణాలు చేపట్టింది కాంగ్రెస్ నాయకులు అని చాలా సైలెంట్ గా విచారణ చేయించి టిఆర్ఎస్ ప్రభుత్వం గుర్తించినట్లు తెలంగాణ రాజకీయాల్లో టాక్. దీంతో జీవో పరిధిలో ఎక్కువ ఫాంహౌస్ లు కాంగ్రెస్ లీడర్లకే ఉన్నాయని సమాచారం తెప్పించుకున్న టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు వారందరికీ నోటీసులు జారీ చేసి కూల్చాలని ప్రయత్నాలు స్టార్ట్ చేయబోతున్నట్లు వార్తలు రావడంతో కాంగ్రెస్ పార్టీ నేతల వెన్నులో వణుకు మొదలైనట్లు టీ కాంగ్రెస్ లో టాక్.

 

ఇటువంటి తరుణంలో త్వరలో తెలంగాణ పీసీసీ పదవి పొందాలని ఆరాటపడుతున్న రేవంత్ రెడ్డి కి సైలెంట్ గా 111 జీవో ద్వారా రేవంత్ చుట్టూ ఉచ్చు బిగించేలా కేసీఆర్ వ్యవహరించాడం జరిగింది. ఈ పరిణామం తో రేపొద్దున రేవంత్ రెడ్డి టీ పీసీసీ పదవి చేపట్టిన… సొంత పార్టీ నేతలే విమర్శలు చేసే విధంగా కేసీఆర్ రాజకీయం నడిపించారని పరిశీలకులు తాజా రాజకీయాలపై విశ్లేషిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: