నరసాపురం వైసీపీ పార్లమెంటు సభ్యుడు రఘురామకృష్ణంరాజు వ్యవహారం ఏపీ రాజకీయాల్లో పెద్ద హాట్ టాపిక్ అయింది. గత కొంత కాలం నుండి ఇండైరెక్ట్ గా వైయస్ జగన్ ని టార్గెట్ చేస్తూ.. టీడీపీ కి ఫేవర్ గా ఉండే మీడియాకి వరుసపెట్టి ఇంటర్వ్యూలు ఇవ్వటంతో పాటుగా జగన్ ని అవమానించే విధంగా ఆయన వ్యాఖ్యలు చేస్తున్నట్లు ఎలక్ట్రానిక్ మీడియా లో సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా 2019 ఎన్నికలలో వైసీపీ పార్టీలో చేరడానికి గల కారణం వైఎస్ జగన్ తన ని.. పార్టీలోకి రమ్మని బతిమాలడం వలన మాత్రమే ఆ పార్టీ ద్వారా పోటీకి దిగినట్లు ఇటీవల రఘురామకృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలు వైసీపీ పార్టీ వర్గాలలో పెద్ద చర్చనీయాంశంగా మారాయి.

 

రఘురామ కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలకు వైసీపీ  పార్టీ ఐదుగురు ఎమ్మెల్యేలు తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. అది కూడా పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు కావటంతో తనపై విమర్శలు చేసిన సొంత పార్టీ ఎమ్మెల్యేలను రాజీనామా చేసి ఎన్నికల లోకి రావాలని నేను కూడా రాజీనామా చేసి వస్తానని విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకుని రఘురామకృష్ణంరాజు తనపై వైసీపీ చేస్తున్న ఎటాక్ కి కౌంటర్లు వేస్తున్నారు. వైసీపీ రఘురామ కృష్ణం రాజు పై కెమెరాలకు పదును పెడుతూ ఇక ఉపేక్షించే కూడదు అని మాటల యుద్ధంతో ఎటాక్ చేస్తున్న సమయంలో ...అమిత్ షా అపాయింట్‌మెంట్ ఖరారయిందనే ప్రచారం సోషల్ మీడియాలో ప్రారంభమయింది. దీంతో వైసిపి పార్టీ వర్గాలు వెనక్కి తగ్గినట్లు ఏపీ రాజకీయాల్లో వార్తలు వినబడుతున్నాయి.

 

అప్పట్లో ఇంగ్లీష్ మీడియం విద్యా విధానం విషయంలో జగన్ నిర్ణయానికి వ్యతిరేకంగా రఘురామకృష్ణంరాజు మాట్లాడిన తర్వాత వైసిపి నాయకులు ఆయన తీరును ఇదే రీతిలో విమర్శించారు. ఆ సమయంలో ఢిల్లీలో బిజెపి పార్టీ నాయకులకు అంతా భోజనలు ఏర్పాట్లు చేసి తన బలం ఏంటో రఘురామకృష్ణంరాజు చూపించారు. ఆ తర్వాత వైసీపీ సైలెంట్ అయిపోయింది. ఇప్పుడు ఇదే మాదిరిగా మళ్ళీ రఘు రామకృష్ణం రాజు పై వైసీపీ పార్టీ వర్గాలు విమర్శలు చేసే టైం లో అమీత్ షా తో అపాయింట్మెంట్ దొరికినట్లు వార్తలు రావడంతో వైసీపీ వర్గాలు మళ్ళీ సైలెంట్ అయినట్లు సమాచారం. దీంతో తాజా పరిణామాలను బట్టి రాజుగారిని ఆపే సత్తా వైసీపీలో ఒక్కరికి కూడా లేదా అన్న ప్రశ్న ఏపీ రాజకీయాలలో ఉత్పన్నమవుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: