దేశవ్యాప్తంగా కరోనా ప్రభావం కారణంగా జనజీవనం అస్తవ్యస్తం అయింది. ఈ వైరస్ ప్రభావానికి ప్రతి ఒక్కరూ గురయ్యారు. ఎంతో మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఎన్నో కంపెనీలు దివాళా తీశాయి. ఇక చిన్నచిన్న వ్యాపారస్తుల సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇలా అందరూ కరోనా ప్రభావానికి గురయ్యారు. ఇప్పటికీ బడుగు జీవులు కరోనా ఎఫెక్ట్ నుంచి తేరుకోలేకపోతున్నారు. ప్రతి ఒక్కరూ ఈ వైరస్ ప్రభావానికి గురైన వారే. వారి బాధలు వర్ణనాతీతం. ప్రశాంతంగా ఎనిమిది గంటల పాటు షాపులు తెరుచుకోలేని పరిస్థితి ఇప్పటికీ ఉంది. ఇక రోడ్ల పక్కన వ్యాపారాలు చేసుకునే వారి కష్టాలు వర్ణనాతీతం . ఇక ప్రభుత్వ ఆదాయం కూడా గణనీయంగా తగ్గిపోయింది.


 ఈ సమయంలో సామాన్యులను ఆదుకునేందుకు కేంద్రం ముందుకు వచ్చి ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించాల్సి ఉన్నా, సామాన్యుడి నడ్డి విరిచే విధంగా ఇప్పుడు పన్నులు వసూలు చేయడం, కేంద్రం దయా దాక్షిణ్యాలు లేకుండా వ్యవహరించడం వంటివి ఇప్పుడు మోడీపై జనాలకు ఆగ్రహాన్ని కలిగిస్తున్నాయ. మోడీ ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరలు రోజువారీగా పెంచుకుంటూ వెళుతోంది. అంతర్జాతీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గు  ముఖం పట్టినా దేశంలో మాత్రం వీటి ధరలు అంతకంతకూ పెరిగిపోతూ సామాన్యుల నడ్డి విరుస్తున్నాయి. పెట్రోల్ డీజిల్ ధరల పెరుగుదల ప్రభావం అన్ని రంగాల్లో పైన ఉంటుంది. వాటి ధరలు పెరిగే కొద్దీ, మిగతా అన్ని రంగాల్లోనూ ధరలు పెరిగిపోతూ ఉంటాయి. కానీ కేంద్రం ఇవేవీ పట్టించుకోకుండా రోజువారీగా ధరలను పెంచుకుంటూ వెళుతోంది.


గడిచిన 11 రోజుల్లోనే లీటర్ పెట్రోల్ మీద 6.02 పెరిగితే, డీజిల్ మీద 6.40 పెరిగింది. రాబోయే రోజుల్లో పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడమే తప్ప తగ్గించే ఆలోచన లేదు అన్నట్లుగా మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. కరోనా వల్ల కలిగిన నష్టాన్ని సామాన్యుడిపై రోడ్డెందుకు మోదీ ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. ప్రజలను ఆదుకోవడానికి ప్రత్యేక ప్యాకేజీలు ఇచ్చి, పన్నుల భారం తగ్గిస్తుందని అంతా భావిస్తున్న సమయంలో ఇలా కరోనా ప్రభావంతో ఇప్పుడు సామాన్య మీద ధరల ప్రభావాన్ని రోడ్డెందుకు కేంద్రం వ్యవహరిస్తున్న తీరు పై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. 


కేవలం పెట్రోల్, డీజిల్ ధరల పెంపుదలతోనే ఆగిపోకుండా, అన్ని రంగాలపైనా పన్ను విధించాలనే ఆలోచనలో బిజెపి ప్రభుత్వం ఉన్నట్టుగా తేలడంతో రాష్ట్రాలు ఆగ్రహంగా ఉన్నాయి. ధరల పెరుగుదల ప్రభావం ప్రభుత్వాలపై ఖచ్చితంగా పడుతుందని, ఇప్పటికే ప్రబుత్వాలు చెబుతున్న, జనాలు మాత్రం ఆగ్రహంగా ఉన్నారని, ఈ సమయంలో ధరలు పెంచడం ఒక్కటే మార్గమని కేంద్రం భావిస్తే దానికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని మెజార్టీ రాష్ట్రాలు సూచిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: