ప్రపంచానికి పెద్ద తలనొప్పిగా ఇన్నాళ్లూ పాకిస్దాన్ అనుకున్నారు కానీ ఇప్పుడు చైనా కుడా దానికి తోడైంది.. ఒకరేమో ఉగ్రవాదుల్లా మారి మానవ బాంబులతో దాడి చేస్తుంటే, మరొకరు గోతికాడి నక్కలా కాపుకాసి దొంగ దెబ్బతీస్తున్నారు.. ఈ ప్రపంచాన్ని శ్మశానంలా మార్చందే ఈ రెండు దేశాలు నిదుర పోయేలా లేవు.. ఇంకెంత కాలం వీరి ఆగడాలు.. భారతీయులంటే అంత అలుసా.. భరతమాత బిడ్దలను ఎదురుగా ఎదుర్కొన లేక ఇలా వెనకనుండి కుట్రలు చేసి దాడిచేయడం గొప్పదనమా.. ఇకపోతే గల్వాన్‌ లోయ వద్ద సోమవారం రాత్రి జరిగిన దాడి ముందస్తు పధకం ప్రకారమే జరిగినట్లుగా వార్తలు వస్తున్నాయి..

 

 

ఈ ప్రదేశంలో ఒక్క తుపాకీ గుండు కూడా పేలకుండానే భారత సైన్యంలో 20 మంది, చైనా వైపు మరో 45 మంది వరకూ ప్రాణాలు కోల్పోవడమే కాదు.. పదుల సంఖ్యలో ఇరు దేశాల సైనికులు తీవ్రంగా గాయపడటం సాధారణ విషయం కాదు. చైనా సైన్యం వ్యూహాత్మకంగానే సంతోష్‌బాబు బృందాన్ని ఉచ్చులో బిగించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా చైనా గల్వాన్‌ నది వద్ద ఏర్పాటు చేసిన 14వ నెంబరు నిఘా చెక్‌పోస్టును తొలగించి మనవాళ్లను నమ్మించిందట.. తిరిగి ఆదివారం అక్కడ చెక్‌పోస్టు ఏర్పాటు చేసింది. ఇలా చేయడం వల్ల భారత సైన్యం ఊరుకోదని, వారు అక్కడికి వచ్చిన సమయంలో ఎలా దాడి చేయాలో ముందస్తుగానే పధకాన్ని రచించుకున్న చైనా అనుకున్న ప్రకారం, సంతోష్‌ నేతృత్వంలోని 16 బిహార్‌ రెజిమెంట్‌ దళం సోమవారం సాయంత్రం ఆ చెక్‌పోస్టును తొలగించడానికి ప్రయత్నించింది.

 

 

దీంతో అప్పటికే అక్కడ మాటువేసిన చైనా సైనికులు ఒక్కసారిగా విరుచుకుపడి ఫెన్సింగ్‌ వైర్లు బిగించిన ఇనుపరాడ్లతో తీవ్రంగా దాడి చేశారని, కొంతమంది సైనికులను ఈడ్చుకుంటూ తమ భూభాగంలోకి లాక్కెళ్లారని, కొంతమంది కొండపై నుంచి పెద్ద బండరాళ్లు విసరడం మొదలుపెట్టారని సమాచారం. అక్కడి పరిస్దితిని అంచనా వేసేలోపే చాలామంది సైనికులు తీవ్రంగా గాయపడ్డారని, మిగిలినవారు గల్వాన్ ‌నదిలో దూకి ఈదుకుంటూ ఒడ్డుకు చేరారని తెలుస్తోంది. వీరిచ్చిన సమాచారంతోనే రంగంలోకి దిగిన అదనపు దళాలు చైనా సైనికులతో తలపడ్డాయని తెలిసింది.

 

 

ఇక 20 మంది భారత సైనికులను పొట్టనపెట్టుకున్నారంటే ఇదంతా వ్యూహాత్మకంగానే జరిగి ఉంటుందనడంలో అనుమానం లేదని ఒక సైనిక అధికారి పేర్కొన్నారు.. కాగా ఇప్పుడు చైనా చేస్తున్న కుట్రలు చూస్తుంటే కరోనా వైరస్‌ను కూడా ముందస్తు ప్రణాళిక ద్వారానే ప్రపంచం అంతట వ్యాపింప చేసిందనడంలో సందేహం లేదనిపిస్తుందని కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.. ఏది ఏమైనా చైనాకు తగినరీతిలో గుణపాఠం నేర్పిస్తే గానీ తన బుద్ధి మారేలా లేదంటున్నారు..  

మరింత సమాచారం తెలుసుకోండి: