ఢిల్లీ ఆరోగ్య శాఖా మంత్రి సత్యేంద్ర జైన్ కరోనా భారీన పడిన సంగతి తెలిసిందే. ఆయనకు మొదటిసారి చేసిన పరీక్షల్లో నెగిటివ్ రాగా తీవ్రమైన జ్వరంతో బాధ పడుతూ ఉండటంతో నిన్న మరోసారి పరీక్షలు నిర్వహించారు. తాజాగా నిర్వహించిన పరీక్షల్లో కరోనా నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఆయన రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆస్పత్రిలో ఢిల్లీ ఆరోగ్య మంత్రి కరోనా భారీన పడ్డారన్న వార్త అధికారులతో పాటు నేతలను టెన్షన్ పెడుతోంది. 
 
ప్రస్తుతం ఆయన ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే అతిషి కూడా కరోనా వైరస్ భారీన పడ్డారు. మరోవైపు ఆదివారం రోజున కరోనా వైరస్ గురించి చర్చించేందుకు జరిగిన సమావేశానికి సత్యేంద్ర జైన్ హాజరయ్యారు. ఈ సమావేశానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ హాజరయ్యారు. సత్యేంద్ర జైన్ కు కరోనా నిర్ధారణ కావడంతో వీరు టెన్షన్ పడుతున్నట్టు తెలుస్తోంది. 
 
మరోవైపు ఢిల్లీ నగరంలో కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ప్రభుత్వం కరోనా కట్టడి కోసం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఫలితం కనిపించడం లేదు. ఢిల్లీలో 44,688 కరోనా కేసులు నమోదు కాగా 16,500 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. 1,837 మంది ఇప్పటివరకు వైరస్ భారీన పడి మృతి చెందారు. కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటం ప్రజలను భయాందోళనకు గురి చేస్తోంది. 
 
వైరస్ కు వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే మాత్రమే కరోనా నియంత్రణ సాధ్యమవుతుందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. పలు దేశాల్లో వ్యాక్సిన్ లు కరోనాను నియంత్రిస్తున్నాయని వార్తలు వస్తున్నా పూర్తిస్థాయి పరిశోధనా ఫలితాలు తెలియాల్సి ఉంది. సామాన్యులతో పాటు రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు కూడా కరోనా భారీన పడుతూ ఉండటం వారి అభిమానులను మరింత భయాందోళనకు గురి చేస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: