దేశం కోసం పోరాడుతూ అమరుడైన కల్నల్ సంతోష్ బాబు అంతిమ యాత్ర ప్రారంభమైంది. చైనా సైన్యంతో జరిగిన ఘర్షణల్లో అమరుడైన కల్నల్ సంతోష్ బాబు బాబు కి ప్రముఖులునివాళులర్పించారు.  ఆయన పార్థీవ దేహంపై త్రివర్ణ పతాకం ఉంచిన సైనికాధికారులు.. సూర్యాపేట విద్యానగర్‌లో ఆయన స్వగృహం నుంచి అంతిమ యాత్ర ప్రారంభించారు.  జిల్లా కలెక్టర్, ఎస్పీతోపాటు పెద్ద ఎత్తున స్థానికులు ఎదురెళ్లి సంతోష్ బాబు పార్థీవ దేహాన్ని తీసుకొచ్చారు. అమరుడైన సంతోష్ బాబును చూసి తల్లిదండ్రులు, భార్య, చెల్లెలు ఎంతగానో విలపించారు.

IHG

సంతోష్ బాబు అమర్ రహే అంటూ స్థానికులు, బంధువులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.  తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, నిజామాబాద్ ఎంపీ డి.అర్వింద్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి తదితరులు సంతోష్ బాబు మృతదేహానికి నివాళులు అర్పించారు.

IHG

మరికాసేపట్లో కేసారంలోని సంతోష్ బాబు కుటుంబ సభ్యుల వ్యవసాయ క్షేత్రంలో సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కాగా, బుధవారం రాత్రి ప్రత్యేక విమానంలో లేహ్ నుంచి చంఢీగఢ్ మీదుగా హకీంపేట ఆర్మీ ఎయిర్‌బేస్ సంతోష్ బాబు పార్థీవ దేహాన్ని తీసుకొచ్చారు. హైదరాబాద్‌లోనే గవర్నర్, కేటీఆర్, రేవంత్ తదితర నేతలు సంతోష్ బాబుకు నివాళులు అర్పించిన విషయం తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: