లద్దాఖ్ లో భారత చైనా సైన్యాల ఘర్షణలో 20 మంది వరకూ భారత్ సైనికులు వీర మరణం పొందారు. ఈ వార్తతో మీడియా ఫోకస్ మళ్లీ ఇండియా-చైనా సంబంధాలు, భారత సైన్యంపై ఫోకస్ అయ్యింది. అయితే ఈ నేపథ్యంలో అసలు సైన్యంలో హోదాలు ఎలా ఉంటాయి.. ఆ హోదాల అర్థం ఏంటి.. సైన్యంలో పదవుల హైరార్కీ ఏంటి.. ఓసారి చూద్దాం..

 

భారత ఆర్మీ విభాగపు అధికారుల హోదాల క్రమాన్ని క్రింద నుండి పైకి చూసుకుంటూ వెళదాం.. సైన్యంలో అన్నింటి కన్నా ప్రారంభపు హోదా LIEUTENANT - లెఫ్టినెంట్ అంటాం.. లెఫ్టినెంట్ కు ప్రమోషన్ వస్తే CAPTAIN - కెప్టెన్ అవుతాడు. కెప్టెన్ కు ప్రమోషన్ వస్తే MAJOR - మేజర్ అవుతాడు. మేజర్ కు ప్రమోషన్ వస్తే LIEUTENANT COLONEL ... లెఫ్టినెంట్ కర్నల్ అవుతాడు.

 

 

లెఫ్టినెంట్ కర్నల్ కు ప్రమోషన్ వస్తే COLONEL ... కర్నల్ అవుతాడు. కర్నల్ కు ప్రమోషన్ వస్తే BRIGADIER - బ్రిగేడియర్ అవుతాడు. బ్రిగేడియర్ కు ప్రమోషన్ వస్తే ... MAJOR GENERAL - మేజర్ జనరల్ అవుతాడు. మేజర్ జనరల్ కు ప్రమోషన్ వస్తే . LIEUTENANT GENERAL - లెఫ్టినెంట్ జనరల్ అవుతాడు.

 

 

లెఫ్టినెంట్ జనరల్ కు ప్రమోషన్ వస్తే GENERAL- జనరల్ అవుతాడు. జనరల్ అనే ఈ అధికారి మొత్తం ఆర్మీ విభాగానికి కమాండర్ -ఇన్ -చీఫ్ అన్నమాట. మరో విషయం ఏంటంటే.. COLONEL అనే ఈ పదం లో "R" అనే అక్షరం కనపడదు ... కానీ "L " కు బదులుగా "R " చదువుకోవాలి ... ఆ క్రమంలో "కల్నల్" అని చదవాల్సిన చోట "కర్నల్" అని చదవాలి, పలకాలి, ఉచ్చరించాలి .

 

 

అలాగే తూర్పు లద్దాఖ్ ప్రాంతంలో, పాంగోంగ్ సరస్సు ప్రాంతంలో GALWAN VALLEY లో పై సంఘర్షణలు జరిగాయి. అయితే కొందరు దాన్ని గాల్వాన్ అనీ, గాల్వన్ అనీ రాస్తున్నారు. దీన్ని గల్వాన్ అనటం సరైంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: