హనుమాన్.. ఈ రూపం తలచుకుంటేనే మనకు కొండంత ధైర్యం వస్తుంది. అభయం ఇచ్చే రూపం హనుమంతునిది. ధైర్యానికి, వీరత్వానికి, భక్తికి ప్రతీక మన హనుమాన్. అలాంటి హనుమాన్ విగ్రహం అమెరికాలో అతి భారీ రూపంలో కొలువు దీరింది. ఎన్నారైలకు అభయం ఇస్తోంది. అమెరికాలోనే అతి పెద్ద హనుమ విగ్రహంగా రికార్డులకెక్కింది.

 

 

అమెరికా న్యూ కేస్టల్ కౌంటీలోని హాక్ సిన్ లో 25 అడుగుల ఎత్తైన ఈ హనుమాన్ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అమెరికాలోనే ఎత్తైన హిందూ దేవుడి విగ్రహంగా నిలిచింది. 45 టన్నుల బరువున్న హనుమంతుడి విగ్రహం పూర్తి కావడానికి ఒక ఏడాది పట్టిందని హాక్ సిన్ లో హిందూ ఆలయ సంఘం అధ్యక్షుడు ప్రతిభానంద శర్మ చెబుతున్నారు.

 

IHG

 

ఇంతకీ ఈ విగ్రహం ఎక్కడ చెక్కారో తెలుసా.. మన వరంగల్ లోనే. రామ భక్త ఆంజనేయుడి విగ్రహ తయారీకి, రవాణాకు 75లక్షల రూపాయలకుపైగా ఖర్చైనట్లు నిర్వాహకులు చెబుతున్నారు. మూడు వందలకుపైగా కుటుంబాలు, అనేక శిల్పులు ఏడాదిపైగా కష్టపడి వాయుపుత్రుని విగ్రహాన్ని తయారు చేశారట.

 

 

ఈ ఏడాది జనవరిలో విగ్రహం నౌక ద్వారా న్యూయార్క్ కు చేరుకుంది. అక్కడి నుంచి ట్రక్ ద్వారా హాక్ సిన్ కు తరలించారు. అంటే వరంగల్ శిల్పులు చెక్కిన ఈ విగ్రహం ఖండాంతరాలు దాటి అమెరికాకు చేరిందన్నమాట. అక్కడ కొలువైన రామ భక్త ఆంజనేయుడి భారీ ప్రతిమ ఎన్నారైల పూజలందుకుంటోంది. జై భజరంగ భళి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: