నరసాపురం వైసీపీ పార్లమెంట్ సభ్యుడు రఘురామకృష్ణంరాజు తనపై విమర్శలు చేసిన వైసీపీ పార్టీ ఎమ్మెల్యేలపై చేసిన కామెంట్లు ఇప్పుడు ఆయనకే సమస్యలు తెచ్చిపెడుతున్నాయి. ఇటీవల ఓ ప్రముఖ టీవీ ఛానల్ లో వైసీపీ హైకమాండ్ పై తీవ్రస్థాయిలో పరోక్షంగా విమర్శలు చేయడం జరిగింది. అధ్యక్షుడు వైయస్ జగన్ పై సెటైరికల్ గా మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీ ని సపోర్ట్ చేసే మీడియా ఛానల్స్ కి రఘురామకృష్ణంరాజు ఇంటర్వ్యూలు మీద ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. కాగా అధ్యక్షుడిపై చేసిన వ్యాఖ్యలకు కౌంటర్లు వేయటానికి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులే మీడియా ముందు రఘురామకృష్ణంరాజు వ్యవహరిస్తున్న తీరును ఎండగట్టారు. కొట్టు సత్యనారాయణ, మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, కారుమూరి నాగేశ్వరరావు ఇంకా మరి కొంత మంది నేతలు రఘురామకృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలను మీడియా ముందు ఖండించడం జరిగింది.

 

దీంతో వెంటనే ఆ తరువాత రఘురామకృష్ణంరాజు 'పందులే గుంపులుగా వస్తాయి సింహం సింగిల్ గా వస్తుంది' అని వాళ్ళను ఉద్దేశించి దారుణమైన వ్యాఖ్యలు చేశారు. వాళ్లు రాజీనామా చేయాలని నేను కూడా రాజీనామా చేస్తానని ఎన్నికలకు వెళ్దాం అంటూ సవాల్ చేశారు. ఇదే సమయంలో సదరు నాయకులపై అవినీతి ఆరోపణలు చేశారు. దీంతో ఆయన చేసిన వ్యాఖ్యల పట్ల సదరు నాయకులు సామాజికవర్గాల సంఘాల నేతలు రఘురామకృష్ణంరాజు ఫ్లెక్సీలను తగలబెడుతూపసుపు నీళ్ళు జల్లి, గాజులు తొడిగి, కోడిగుడ్లు టమోటాలతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 

ఈ ఆందోళన కార్యక్రమంలో క్షత్రియ మరియు యాదవ సంఘాలు అదేవిధంగా వైకాపా కార్యకర్తలు నాయకులు పాల్గొని రంగనాథరాజు చేసిన అవినీతి ఆరోపణలు ఉపసంహరించుకుని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. మొత్తం మీద పరిస్థితి చూస్తే సొంత జిల్లాలో రఘురామకృష్ణంరాజు కి రాజకీయ దెబ్బ గట్టిగానే పడే అవకాశం ఉందని తాజా పరిస్థితుల బట్టి పరిశీలకులు భావిస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: