మహమ్మారి కరోనా తీసుకొచ్చిన లాక్ డౌన్ దెబ్బకు ప్రజలంతా ఇంట్లోనే ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఉండటం జరిగింది. దీంతో చాలా వరకు ఉపాధి కోల్పోయి పేదలు మరియు వివిధ రంగాలకు చెందిన ఉద్యోగులు సగం సగం జీతాలతో జీవితాలను ప్రస్తుత నెట్టుకొస్తున్నారు. ఇటువంటి సమయంలో మొదటిలో ఎవరైనా ఉద్యోగస్తులను ఉద్యోగాల నుంచి తొలగిస్తే ఊరుకునే ప్రసక్తి లేదని.. అంతే కాకుండా జీతాలు కూడా ఫుల్లుగా చెల్లించాలని ప్రభుత్వాలు ఉద్యోగ కంపెనీలకు యాజమాన్యాలకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అప్పుడు అలా ఉంటే ఇప్పుడు మోడీ స్టైల్ అంతా మారిపోయినట్లు ప్రస్తుత పరిణామాలు బట్టి తెలుస్తోంది.

 

క్షుణ్నంగా విషయంలోకి వెళ్తే ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలకు అండగా నిలవాల్సిన సమయంలో… దేశ ఆర్థిక వ్యవస్థకు ఆదాయం తగ్గిపోయింది అనే భావనతో మోడీ సర్కార్ పెట్రోల్, డీజిల్ ధరల్ని రోజు వారీగా పెంచుకుంటూ పోతుంది. అంతర్జాతీయంగా పెట్రోల్.. డీజిల్ ధరలు నేల చూపులు చూస్తున్నా కూడా దేశంలో మాత్రం అంతకంతకూ పెరిగిపోతున్నాయి. అసలు ఉపాధి లేక పనులు లేక ప్రజలు అనేక అవస్థలు పడుతున్న ఈ సమయం లో… ముడి చమురు లపై ధరలు పెంచుకుంటూ మోడీ సర్కార్ వెళ్లి పోవడం పట్ల తీవ్ర స్థాయిలో సామాన్యుల పై ప్రభావం గట్టిగా చూపిస్తోంది.

 

ఏదో ఉద్యమం చేస్తున్నట్లుగా వరుసగా రోజు రోజుకీ ధరల్ని పెంచుకుంటూ పోతోంది కేంద్ర ప్రభుత్వం. పదకొండో రోజున కూడా పెట్రోల్.. డీజిల్ ధరల్ని పెంచేస్తూ నిర్ణయం తీసుకుంది. ఒక వైపు కరోనా ఆదుకునే బడ్జెట్ గా 20 లక్షల కోట్ల బడ్జెట్ పేరుకు ప్రకటించి వాటి ఫలాలు ఎవరికి అందాయో అర్థం కాని మాటలు చెప్పి ఇప్పుడు సామాన్యుడిపై భారం పెట్టే విధంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడం పట్ల తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. మోడీ సర్కార్ చెప్పే మాటలకు చేసే పనులకు అసలు పొంతన లేదని, ఇలాంటి నాయకులు మాటలు వింటే మనకు తెలియకుండానే మనమే మునిగి పోతామని జనాలు ఆయిల్ రేట్లు పెంచడం పట్ల విమర్శలు చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: