ప్రపంచంలోకరోనా వైరస్ వ్యాప్తి చెందినప్పటి నుంచి పోలీసులు, డాక్టర్లు నిర్విరామంగా పనులు చేస్తూనే ఉన్నారు.  డాక్టర్లు అయితే వారి ప్రాణాలకు తెగించి మరీ కరోనా పేషెంట్స్ కి చికిత్స అందిస్తున్నారు.  ఇక కరోనా రోగులు మరణించిన తర్వాత వారిని ఖననం చేసే వరకు పోలీసులు నానా తిప్పలు పడుతున్నారు.  ఇది అన్ని దేశాల్లో జరుగుతున్న తంతే. ఫ్రాన్స్ ఇప్పుడు కొత్త సమస్యలో చిక్కుకుంది. కరోనా వ్యాప్తి, లాక్ డౌన్ కారణంగా గడచిన మూడు నెలలుగా విపరీతమైన ఒత్తిడిలో డ్యూటీలు చేస్తున్న పోలీసులు, తమ విధులను బహిష్కరించి రోడ్లెక్కారు. ఎవరైనా ఆందోళనకు దిగితే అదుపు చేయాల్సిన పోలీసులే నిరసన కార్యక్రమం చేపట్టారు.

 

ఉద్యోగ ఒత్తిడిని తట్టుకోలేక రోడ్లపైకి వచ్చి శాంతియుతంగా ఆందోళన చేశారు. విధులను బహిష్కరించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పారు. తమకు మెరుగైన పనితీరు వాతావరణాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ, నేరస్థులకు వేయాల్సిన బేడీలను నడి రోడ్డుపై పడేసిన పోలీసులు, తమ నిరసనను తెలిపారు. అంతే కాదు తమ అంతర్గత వ్యవహారాల మంత్రి తక్షణం రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.  అమెరికాలో జార్జ్ ఫ్లాయిడ్ మృతి తరువాత ఫ్రాన్స్ లో కూడా నిరసనలు వెల్లువెత్తాయి. వారిని అరికట్టే సమయంలో నిరసనల్లో ఉన్న ఓ మెడికల్ వర్కర్‌పై పోలీసులు దాడి చేశారు.

 

ఆమెను లాక్కెళ్లడంతో తలకు గాయమై రక్తం కారింది. ఇక ఈ విషయం తెలుసుకున్న ప్రజలు పోలీసులపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దాంతో అటు ప్రభుత్వం మాటలు విని తమ డ్యూటీలు చేయాలి.. ఇటు ప్రజలతో నానా తిట్లు... వ్యతిరేకతను పొందాలి ఇలా అయితే మా డ్యూటీలు ఎలా చేయాలని ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి సమయంలో డ్యూటీలు తమ వల్ల కాదంటూ పోలీసులు సైతం నిరసన వ్యక్తం చేశారు. హ్యాండ్ కప్స్, బేడీలను నేలపై పెట్టి విధులు బహిష్కరించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: