తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ ని సమర్థవంతంగా ఎదుర్కోగల ఇతర పార్టీలు లేవనట్టు మొన్నటి వరకు రాజకీయ పరిస్థితులు నెలకొన్నాయి. 2014వ సంవత్సరం నుండి టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటూ ఎన్నో వైఫల్యాలు చేస్తున్నప్పటికీ... వాటన్నిటిపై ధైర్యంగా మాట్లాడి పోరాడగలిగే ఒక్క రాజకీయ నేత కూడా లేకపోవడం ప్రజలందరినీ విస్తుపోయేలా చేసింది. కానీ ఆ రాష్ట్రంలో నెలకొంటున్న ప్రస్తుత రాజకీయ పరిస్థితులను గమనిస్తుంటే రేవంత్ రెడ్డి టిఆర్ఎస్ పార్టీ వైఫల్యాలను ప్రజల దృష్టికి తెచ్చి అసలు సిసలైన తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ గా పేరు తెచ్చుకుంటున్నారని తెలుస్తుంది. 

IHG
తమ ప్రభుత్వ వైఫల్యాలు ప్రజల దృష్టికి తీసుకువెళ్ళకుండా పాత్రికేయ మిత్రులను, రాజకీయ నాయకులను ముఖ్యమంత్రి కేసీఆర్ అణిచివేస్తున్నారని రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారన్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నుండి తానొక్కడే సరైన టైంలో అధికార పక్షాన్ని దిమ్మతిరిగే రీతిలో ప్రశ్నిస్తూ అందరి ప్రశంసలను అందుకుంటున్నారు. 4 రోజుల క్రితం రేవంత్ రెడ్డి తెలంగాణ వైద్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ కు మద్దతుగా మాట్లాడుతూ కెసిఆర్ ని ఇరకాటం లోకి నెట్టేశారు. వాస్తవానికి గతంలో జరిగిన కొన్ని పరిమాణాల వలన ఈటల రాజేందర్ అంటే కేసీఆర్ కి కాస్త కోపం. ఎటువంటి చాన్సు దొరికినా, ఛాన్స్ దొరకకపోయినా తానే స్వయంగా క్రియేట్ చేసి మరీ ఈటల రాజేందర్ ను పదవుల నుండి తొలగించే యోచనలో కేసీఆర్ ఉన్నాడని రాజకీయ విశ్లేషకులు చెబుతుంటారు. కానీ తాను అలా చేస్తే ప్రజల్లోకి అది నెగిటివ్ గా వెళ్తుందనే ఉద్దేశంతో ఇన్నిరోజులు అతడిని తన గ్యాంగ్ లోనే ఉంచుతున్నారని తెలుస్తుంది. 

IHG
ఐతే రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో తాను చేసిన వైఫల్యాలను మొత్తం వైద్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ మోపి అతడిని పదవి నుంచి తొలగించాలని కేసీఆర్ కత్తులు నూరుతున్నాడని రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేయడంతో కేసీఆర్ వెనక్కి తగ్గాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలాగే గాంధీ ఆస్పత్రిలో వసతులు సరిగా లేవని అందుకే కరోనా వైరస్ సోకిన టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రైవేటు హాస్పిటల్స్ లలో చేరుతున్నారని, ప్రభుత్వ ఆసుపత్రులలో పేదవాళ్ళకి, మధ్యతరగతి వాళ్లకి మెరుగైన వైద్యం అందించడంలో అధికారపక్షం శ్రద్ధ వహించడం లేదని రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 

IHG
కరోనా రాష్ట్రంలో అడుగుపెట్టిన వేళ ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్ చుట్టూ ఒక్కొక్క ఆసుపత్రిని బ్రహ్మాండంగా నిర్మించి కరోనా రోగులకు మెరుగైన చికిత్సని అందిస్తాం అని చాలా గొప్పగా ప్రకటించాడు. ఇందులో భాగంగానే గచ్చిబౌలి ప్రాంతంలో టిమ్స్ హాస్పటల్ నిర్మాణాన్ని రెండు నెలల క్రితమే ప్రారంభించాడు. కానీ ఆ ఆసుపత్రి నిర్మాణ పనులన్నీ పూర్తిగా అయిపోయినప్పటికీ డాక్టర్లను గానీ నర్సు లను గాని ఆసుపత్రిలో పెట్టుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ఆసక్తి చూపలేదు. ఒకవైపు గాంధీ ఆస్పత్రిలో కరోనా వైరస్ పేషెంట్ల సంఖ్య విపరీతంగా పెరుగుతూ ఉంటే... టిఆర్ఎస్ ప్రభుత్వం నిమ్స్ ఆసుపత్రిని కోవిడ్ 19 కొరకు వినియోగించింది కానీ... టిమ్స్ ఆసుపత్రికి వైద్యులను రప్పించి వైద్యం చేయించాలన్న ఆలోచన చేయలేదు. ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి టిమ్స్ ఆసుపత్రిని సందర్శించి నలుగురు సెక్యూరిటీ గార్డులు తప్ప ఎవరూ లేరని, కనీసం డ్రైనేజీ సిస్టం కూడా లేదని మండిపడ్డారు. దాంతో తెలంగాణ ప్రభుత్వం టిమ్స్ ఆసుపత్రిలో పనిచేసేందుకు 499 వైద్య సిబ్బంది కావలెను అని ఒక ప్రకటన ప్రకటించింది.

IHG

ఒకవేళ రేవంత్ రెడ్డి ఈ ఆసుపత్రి గురించి పట్టించుకోకపోతే నియామకాల నోటిఫికేషన్ జారీ అవ్వకపోయేదేమో అనే భావన ప్రజల్లోకి గట్టిగా వెళ్ళిపోయింది. దీంతో రేవంత్ రెడ్డికి ప్రస్తుతం ప్రశంసలు దక్కుతున్నాయి. అయితే వైద్య సిబ్బంది కొరకు తెలంగాణ ప్రభుత్వం ప్రకటన విడుదల చేస్తుందన్నంగా ఆ విషయాన్ని రేవంత్ రెడ్డి తనకు బాగా పరిచయమున్న నేతల ద్వారా తెలుసుకొని ఆ ఆసుపత్రిని సందర్శించారా అనే అనుమానాలకి తెర లేపుతున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఏదేమైనా టిఆర్ఎస్ పార్టీలో అంతర్గత విషయాలను తెలుసుకోవడానికి రేవంత్ రెడ్డి ఎవరైనో ఒకరిని పంపించి బర్నింగ్ విషయాలపై పెదవి విప్పుతూ కెసిఆర్ కి కంటిలోని నలుసుగా మారారని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి శక్తివంతమైన నాయకుడిగా రేవంత్ రెడ్డి ఎదుగుతారని, టిఆర్ఎస్ పార్టీకి గట్టి పోటీని ఇస్తారని చాలా మంది అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: