అసలే ఆర్థిక వ్యవస్థ అటు ఇటు గా డేంజర్ గా ఉన్న సమయంలో కరోనా వైరస్ రాకతో లాక్ డౌన్ దెబ్బకు మరింత కుదేలయింది. ఇటువంటి సమయంలో మోడీ తీసుకున్న నిర్ణయాలు అటు ప్రజలలో ఇటు ప్రతిపక్షాల లోనూ జనగణ భావనలు ఏర్పడుతున్నాయి. మొదటి నుండి మోడీ వ్యవహారం విధంగానే ఉందని చాలామంది ప్రస్తుత ఈ పరిణామాలను బట్టి భావిస్తున్నారు. అప్పట్లో 2014 ఎన్నికల టైం లోనే ప్రధాని అభ్యర్థిగా మోడీని ప్రకటించిన సమయంలో విదేశాల నుండి నల్లధనాన్ని తీసుకువస్తామని దేశమంతటా పంచుతానని ప్రకటించి దేశవ్యాప్తంగా హైలెట్ అయ్యారు. ఆ తర్వాత ఎన్నికలలో గెలిచి ప్రధాని అవ్వటం మనందరం చూసాం. ఇంకేముంది మోడీ ప్రధాని అయ్యాడు నల్లధనాన్ని తీసుకువచ్చి అందరికీ పంచు తారని అందరూ ఆశగా ఎదురు చూశారు. అందరూ ఆశలు అడియాసలయ్యాయి. నల్లధనాన్ని తీసుకురాలేదు ఎవరికీ పంచలేదు. అంతే కాకుండా ఆ సమయంలో నోట్ల మార్పిడి అనే దారుణమైన నిర్ణయం తీసుకుని అతి పెద్ద తప్పు చేసి ఆర్థిక వ్యవస్థకు తీరని నష్టం చేకూర్చే నిర్ణయాలు తీసుకున్నారు.

 

దీంతో అప్పటి నుండి భారత ఆర్థిక వ్యవస్థ అటు, ఇటు గా నష్టాల్లోనే కొనసాగుతోంది. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి ఏ మాత్రం మోడీ చొరవ చూపించడం లేదని, ఈ దేశాన్ని ప్రమాదకర స్థితిలో తీసుకెళ్లే అవకాశం ఉందని ఆర్ధిక నిపుణులతో పాటు ప్రతిపక్షాలు కూడా ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉన్నాయి. ఇటువంటి సమయంలో ప్రస్తుతం కరోనా వైరస్ క్రైసిస్ తో పాటు మరోపక్క చైనా తో యుద్ధం ఇవన్నీ పరిస్థితులు చూస్తుంటే మోడీ వచ్చే సార్వత్రిక ఎన్నికల లో గెలిచే అవకాశం ఏ మాత్రం లేదని చాలామంది అంటున్నారు.

 

కరోనా వైరస్ తో యుద్ధం చేస్తున్న భారత్ సగం గెలిచింది, ఓపిక పట్టండి ఇంట్లోనే ఉండండి అని మోడీ పిలుపు ఇచ్చిన మరోపక్క వైరస్ భయంకరంగా దేశంలో వ్యాప్తి చెందటం కేంద్ర ప్రభుత్వం యొక్క ఫెయిల్యూర్ అని చాలామంది అభివర్ణిస్తున్నారు. ఈ విధంగా మోడీ ఆర్థిక వ్యవస్థ డీల్ చేయటంలో అదేవిధంగా కరోనా వైరస్ దేశంలో వ్యాప్తి చెందకుండా అరికట్టడంలో ఫెయిల్ అయ్యారనే భావన ప్రతి ఒక్కరిలో నెలకొంది. ప్రస్తుత పరిస్థితుల బట్టి చూస్తుంటే వచ్చే ఎన్నికలలో మోడీ గెలవడం కష్టమే అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: