మహిళ రక్షణ కోసం ఎన్ని చట్టాలు వచ్చినా శిక్షలు విధించినా వారిపై అఘాయిత్యాలు మాత్రం ఆగడం లేదు. దేశంలో నిత్యం ఏదొక ప్రాంతంలో మహిళలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. చిన్న పెద్దా తేడా లేకుండా మృగాళ్లు మహిళలపై విరుచుకుపడుతున్నారు. మహిళలు ఒంటరిగా కనిపిస్తే చాలు అఘాయిత్యాలకు ఒడిగడుతున్నారు. ఏటేటా మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాల సంఖ్య  క్రమేపీ పెరుగుతూనే ఉందికానీ తగ్గడం లేదు. ఒకవైపు ప్రభుత్వాలు మహిళల రక్షణకు చర్యలు తీసుకుంటున్నా ఇలాంటి ఘటనలు మాత్రం జరుగుతూనే ఉన్నాయి.తొమ్మిదేళ్ల క్రితం దేశ రాజధాని ఢిల్లీలో అర్థరాత్రి కదులుతున్న బస్సులో నిర్భయపై అనే యువతి పై జరిగిన అత్యాచారం తర్వాత చట్టాలు ఎంత పటిష్టం చేసినా కూడా లాభం లేకుండా పోయింది.

 

 

ఢిల్లీ లాంటి  ఘటన లాంటిదే బుధవారం యూపీలో కూడా జరిగింది. కదులుతున్న బస్సులో మహిళపై అత్యాచారం జరిగింది. ఇద్దరు బస్సు డ్రైవర్లు ఆమెపై అత్యాచారానికి తెగబడ్డారు.వివరాల్లోకి వెళ్తే...

 


ప్రతాప్‌గఢ్ నుంచి నోయిడాకు వెళ్తున్న ఓ ప్రైవేటు ఏసీ స్లీపర్ బస్సు 25 ఏళ్ల మహిళ తన ఇద్దరు పిల్లలను తీసుకుని బస్సు ఎక్కింది. ఒంటరిగా ప్రయాణం చేస్తున్న మహిళపై కన్నేశారు. పధకం ప్రకారం బస్సు డ్రైవర్లు ఆమెను వెనుక చివరి సీట్లో కూర్చోమన్నారు. తరువాత తన పిల్లలను చంపుతామని బెదిరించి కదులుతున్న బస్సులోనే ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టారు. బస్సు దిగిన వెంటనే ఆమె భర్త సహకారంతో పోలీసులకు ఫిర్యాదు చేసిందామె.

 

పోలీసులు నిందితులపై ఐపీసీ సెక్షన్ 36, 506 కింద  కేసు నమోదు చేశారు. పోలీసులు ఈ దారుణానికి పాల్పడ్డ నిందితుల్లో ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. ఇంకో నిందితుడు పరారీలో ఉన్నాడు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నిందితులకు కఠినమైన శిక్షలు వేయాలని అప్పుడే ఇలాంటి అఘాయిత్యాలు తగ్గుతాయని, శిక్షల అమలు విషయంలో ప్రభుత్వాలు కూడా కఠినంగా వ్యవహరించాలని పలువురు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: