భారత్ మరియు చైనా సరిహద్దుల నియంత్రణ రేఖ వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెల కొంటూనే ఉన్నది. ఇటీవల భారత్ ఆర్మీ కి చెందిన 20 మంది సైనికులను పొట్టనపెట్టుకుంది చైనా. కావాలనే దూకుడుతో భారత్ ని కవ్వింపు చర్యల తో చైనా వ్యవహరిస్తోందని అంతర్జాతీయ మీడియా చైనా నీ ఏకి పారేస్తోంది. ప్రస్తుతం ఇంకా ఉద్రిక్తత వాతావరణం కొనసాగుతున్న తరుణంలో వెంటనే కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యి సరిహద్దుల వద్ద హై అలర్ట్ ప్రకటించింది. అదే సమయంలో భారీగా బలగాలను మోహరింపు చేస్తూ యుద్ధ సామాగ్రిని తరలిస్తోంది. ఇదే సమయంలో రక్షణ శాఖ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది.

 

ఒకవైపు దౌత్య మార్గాల్లో శాంతి ప్రయత్నాలు ప్రయత్నిస్తూనే మరోవైపు చైనా తంత్రాలను తిప్పికొట్టేందుకు సరిహద్దులలో భారీ బలగాలను మోహరిస్తోంది భారత్. తూర్పు లడక్ లోని గాల్వాన్ లోయ దగ్గర ఇరుదేశాల సైనికులు ఘర్షణ పడటం...రెండు వైపులా ప్రాణనష్టం తీవ్రస్థాయిలో జరగడంతో వాస్తవ రేఖ వద్ద తీవ్రస్థాయిలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఎంతో శాంతియుతంగా ప్రతి విషయంలో వ్యవహరిస్తున్న భారత్ ని దెబ్బ కొట్టడానికి చైనా కావాలని కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న ట్లు ప్రస్తుత పరిణామాలను బట్టి అంతర్జాతీయ మీడియా భారత్ కి బాగా సపోర్ట్ చేస్తోంది.

 

ఈ తరుణంలో ప్రభుత్వాలు ఎలాంటి ఉద్దేశాలు తీసుకున్నా గాని, దేశంలో ఉన్న ప్రజలు ఇలాంటి పరిస్థితుల్లో చాలావరకు చైనా ఆర్థిక వ్యవస్థ దెబ్బ కొట్టడానికి చైనా వస్తువులు నిషేధిస్తూ భారతీయుల రియాక్షన్ స్ట్రాంగ్ గా ఉండాలని అది చైనాకు తెలిసేలా గా చైనా వస్తువులను నిషేధించాలని చాలా మంది కోరుతున్నారు. ఈ విధంగా భారతీయులు చేస్తే చైనా ఆర్థిక వ్యవస్థ దెబ్బ తీసినట్లు అవుతుంది అని అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరోపక్క ప్రభుత్వం ఆర్మీ ద్వారా యుద్ధం చేస్తే మరోపక్క దేశంలో ప్రతి భారతీయుడు చైనా వస్తువులు నిషేధిస్తే ఈ కోణంలో చైనా దారుణంగా నష్టపోయే అవకాశం ఉంటుంది అని చాలామంది అభివర్ణిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: