డ్రాగన్ దేశం హద్దుమీరి పైకి శాంతిగా ప్రవర్తిస్తున్న కవ్వింపు చర్యలకు పాల్పడి భారత్ ఆర్మీ ని బలితీసుకుంది. హద్దులు దాటి భారత భూభాగం లో ప్రవేశించి నిర్మాణాలు చేపట్టడంతో మన భారత్ ఆర్మీ సైనికులు ప్రశ్నించడంతో ఒక్కసారిగా భారత్ మరియు చైనా సరిహద్దుల వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.  చర్చలతో  సరిహద్దుల సమస్యలు పరిష్కరించుకుందాం అని  మైకుల ముందు మాట్లాడిన చైనా  సరిహద్దుల్లో మాత్రం తన మార్క్ బుద్ధి చూపించడం జరిగింది.  లడక్  సరిహద్దు ప్రాంతం వద్ద  తీవ్రతర  ఈ పరిణామాలు చోటు చేసుకోవడంతో ఇరు దేశాల సైనికులు  ఒకరిపై ఒకరు దాడి చేసుకోవటంతో  రెండు దేశాలకు తీవ్రస్థాయిలో ప్రాణనష్టం  జరిగింది.  ఈ ముఖ ముఖి పోరాటంలో రాళ్ళూ మరియు ఇనుప రాడ్ల తో  ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. 

 

దీంతో తీవ్ర స్థాయిలో  ప్రాణ నష్టం జరిగింది.  దేశంలో  కూడా 20 మంది సైనికులను పొట్టన పెట్టుకోవడం పట్ల  తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కరోనా వైరస్ పుట్టినిల్లు చైనా అని ఇప్పటికే ప్రపంచమంతా భావిస్తూ చైనాని ఒంటరిని చేయాలని అనేక దేశాలు ఆలోచిస్తున్నాయి. ఇలాంటి సమయంలో కరోనా వైరస్ ని ఎదుర్కొని.. 2025 లో ప్రపంచంలో సూపర్ పవర్ కంట్రీగా భారత నిలిచే అవకాశం ఉందని వార్తలు రావడంతో భారత్ ని బలహీనపరచడానికి చైనా ఈ దుందుడుకు కవ్వింపు చర్యలకు పాల్పడుతోందని అంతర్జాతీయ మీడియా అభివర్ణిస్తోంది. ఈ నేపధ్యంలో ప్రస్తుతం దేశంలో చైనా వస్తువులను 'గెటౌట్ చైనా' అంటూ సోషల్ మీడియాలో 'బాయ్ కట్ చైనా' అంటూ నెటిజన్లు కొత్త ఉద్యమానికి తెరలేపారు. చైనా వస్తువులను ఇక దేశంలో కొనకూడదని అందరూ భావిస్తున్నారు.

 

ఇప్పటికే దేశంలో కొన్ని ప్రాంతాలలో చైనా ఉత్పత్తులకు వ్యతిరేకంగా ప్రజలు గళం విప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో అఖిలభారత వర్తకుల సమైక్య కూడా రంగంలోకి దిగింది. చైనాలో తయరయ్యే 500కి పైగా ఉత్పత్తులను బహిష్కరిస్తున్నట్టు ప్రకటించింది. దీనికి సంబంధించిన జాబితా విడుదల చేసింది. ఇందులో బొమ్మలు, అపెరల్స్, టెక్స్ టైల్స్, హ్యాండ్ బ్యాగ్స్, కిచెల్ ఐటమ్స్, కాస్మొటెక్స్, లగేజ్ ఐటెమ్స్, ఎలక్ట్రానిక్స్, వాచీలు, స్టేషనరీ, ఆటో పార్ట్స్, జ్యూయలరీ వంటి ఉత్పత్తులున్నాయి.ఈ ఐటమ్స్ లో చైనా ఉత్పత్తి చేసే వస్తువులను దేశప్రజలు కొనకూడదని సీఏఐటీ ‘గెటౌట్ చైనా’ పేరిట బాగా ప్రచారం చేస్తోంది.

 

అయితే ఈ విషయంలో చాలా వరకు సాధ్యమయ్యే పనేనా అని సోషల్ మీడియాలో కొంతమంది ఈ విషయంపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఒక విధంగా చూసుకుంటే చైనా దేశంలో ఇతర దేశాలకు చెందిన కంపెనీలను వారు చైనా లో లేకుండా ఎతేసుకుని వెళ్ళిపోతున్నారు, ఇలాంటి సమయంలో దేశంలో చైనా వస్తువులను నిరోధించడం పెద్ద విషయమేమీ కాదని ప్రపంచానికి మన దేశానికి ప్రమాదకరంగా ఉన్న ఇలాంటి చైనా పై మనం వస్తువులు కొనకుండా ఉండటమే యుద్ధం చేసినట్లు అవుతోందని పేర్కొంటున్నారు. కాబట్టి దేశ ప్రజలంతా ఒక్కతాటిపై నిలిస్తే  ఇది సాధ్యం అయ్యే పని అని సూచిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: