ఆంధ్రప్రదేశ్ లో రాజ్యసభ ఎన్నికల నేపధ్యంలో ఇప్పుడు జరగబోయే పరిణామాలు ఏంటీ అనేది ఆసక్తికరంగా మారింది. టీడీపీకి ముగ్గురు ఎమ్మెల్యేలు ఊహించని విధంగా షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. కృష్ణా జిల్లా గన్న‌వ‌రం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్, ప్ర‌కాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం అలాగే గుంటూరు ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మెల్యే మద్దాలి గిరి జగన్ కి జై కొట్టారు. రాజకీయ భవిష్యత్తుని దృష్టి లో పెట్టుకుని వారు పార్టీ మారడానికి రెడీ అయ్యారు. టీడీపీకి రాజీనామా చేసారు. 

 

ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు వస్తున్న వార్తల ఆధారంగా చూస్తే టీడీపీ వాళ్ళ ముగ్గురుకి రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి విప్ జారీ చేసిన నేప‌థ్యంలో ఈ ముగ్గురు గనుక టీడీపీకి వ్యతిరేకంగా ఓటు వేస్తే వారిని సభ నుంచి సస్పెండ్ చేసే అవకాశ౦ ఉందని... పదవులు పోయే అవకాశాలు ఉన్నాయి అని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. వారు ఇప్పుడు పదవి గండం లో ఉన్నారని అంటున్నారు. వారి విషయంలో టీడీపీ వ్యూహాత్మకంగా వ్యవహరించి షాక్ ఇవ్వడానికి రాజ్యసభకు సీనియర్ నేత వర్ల రామయ్యను నిలబెట్టింది అని అంటున్నారు పరిశీలకులు. 

 

ఇప్పుడు వారికి విప్ జారీ చేస్తే కచ్చితంగా సభకు రావాల్సి ఉంటుంది. మరి వారు సభకు వస్తారా ? లేదా అనేది చూడాలి. ఇకశాసన సభ సమావేశాల్లో వాళ్ళు పార్టీకి దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. దూరంగానే కూర్చుని ఉన్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు నిర‌స‌న వ్య‌క్తం చేస్తున్నా వీరు మాత్రం త‌మ ప్లేసుల్లో సైలెంట్‌గా ఉన్నారు. అయితే ఇక్క‌డే మ‌రో ట్విస్ట్ కూడా ఉంది. వీరు ఓటు వేయ‌క‌పోయినా వైసీపీకి వ‌చ్చే న‌ష్టం లేదు. ఈ నేప‌థ్యంలో వీరు ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటార‌న్న‌ది స‌స్పెన్స్‌గా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: