అనంతపురం జిల్లా రాజకీయాల్లోనే కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జేసీ కుటుంబానికి ఉన్న ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రాజకీయాల్లో వాళ్ళు చూడని పదవులు లేవు. దాదాపు జేసి దివాకర్ రెడ్డి సిఎం పదవి వరకు వెళ్ళిన నేత అనే సంగతి అందరికి తెలిసిందే. సిఎం పదవి వైఎస్ కి రావడంతో ఆయనకు కేబినేట్ లో అప్పుడు కీలక శాఖలు ఇచ్చారు. ఆ త‌ర్వాత అదే వైఎస్ జేసీని ప‌క్క‌న పెట్టారు. జిల్లాలో జేసీని ప‌క్క‌న పెట్టిన వైఎస్ ర‌ఘువీరాకు బాగా ప్ర‌యార్టీ ఇచ్చారు.

 

ఇది పక్కన పెడితే ఆయనకు కాంగ్రెస్ పార్టీలో అగ్ర నేతగా అప్పట్లో మంచి గుర్తింపు కూడా ఉండేది. వైఎస్ తో విభేదాలు ఉన్నా సరే ఆయన మాత్రం చాలా వరకు జాగ్రత్తగా ఉంటూ రాజకీయం చేసారు అనే సంగతి తెలిసిందే. అలాంటి జేసీ ఫ్యామిలీ ని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెళ్లి పరామర్శించి ఆయనతో చర్చలు జరిపారు. బహుశా వారి రాజకీయ జీవితంలో ఇంతకు మించి చూసి ఉంటారు. అలాంటి వ్యక్తిని పరామర్శించే విషయంలో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వెళ్ళాల్సి ఉంటుంది. అంతే గాని లోకేష్ ని పంపి ఆయన చేతులు దులుపుకున్నారు. 

 

ఒక‌ప్పుడు ఎంతో గౌర‌వంగా ఉండి రాష్ట్ర రాజ‌కీయ‌ల‌ను శాసించిన నేత చివ‌ర‌కు లోకేష్ ప‌రామ‌ర్శ‌తో స‌రిపెట్టుకోవాల్సి వ‌చ్చింద‌ని వైసీపీ నేత‌లు ఓ రేంజ్‌లో కౌంట‌ర్లు వేయ‌డంతో పాటు ఆటాడుకున్నారు. ఇక అసెంబ్లీ సమావేశాల కారణంగా చంద్రబాబు వెళ్ళలేదు అని టీడీపీ నేతలు చెప్తున్నా సంగతి తెలిసిందే. అసెంబ్లీ సమావేశాలు జరిగేది రెండు రోజులు. మరి చంద్రబాబు అవి అయిన తర్వాత వెళ్ళవచ్చు కదా అని పలువురు సెటైర్లు వేస్తున్నారు. పాపం ఎలాంటి జేసీ చివ‌ర‌కు ఎలా ? అయిపోయాడు..?

మరింత సమాచారం తెలుసుకోండి: