గత కొంత కాలంగా ఏపిలో రాజకీయాలు వాడీ వేడిగా సాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ రోజు మీడియా సమావేశంలో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ..  ఏపీ శాసనమండలి నారా లోకేష్  రూల్స్ బ్రేక్ చేశాడని..  సభలో నిబంధనలకు విరుద్ధంగా ఫొటోలు తీశాడని, ఎవరు చెప్పినా వినిపించుకోలేదని  శాసనమండలి చైర్మన్ కూడా చెప్పారని, అయినప్పటికీ లోకేశ్ ఫొటోలు తీసి శాసనమండలి నిబంధనలు బేఖాతర్ చేశారని అన్నారు. ఆ సమయంలో దాంతో తాను జోక్యం చేసుకుని ఫొటోలు తీయొద్దంటూ లోకేశ్ కు చెప్పానని వివరించారు.

 

అయితే, టీడీపీ ఎమ్మెల్సీలు బీద రవిచంద్ర యాదవ్, దీపక్ రెడ్డి తనపై దాడి చేశారని, అందుకు లోకేశ్ ప్రోత్సాహం ఉందని వెల్లంపల్లి తెలిపారు. తనపైనే కాకుండా ఇతర మంత్రులు గౌతమ్ రెడ్డి, కన్నబాబులపైనా దాడి జరిగిందని వివరించారు. తండ్రి తనకు రాజకీయ చరిత్ర ఎంతో ఉందని చెబుతుంటారు.. మరి తనయుడికి ఆ మాత్రం రూల్స్ గురించి చెప్పకపోవడం శోచనీయం అన్నారు. లోకేశ్ తీరు చూస్తుంటే సిగ్గేస్తోందని అన్నారు.

 

అసెంబ్లీలో బిల్లులు ప్రవేశపెట్టినప్పుడు చర్చించని టీడీపీ, మండలిలో మాత్రం బిల్లులను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. అలాంటి వారు కొంత కాలం వరకు శునకానందం తప్ప మరొకటి కాదని ఎద్దేవా చేశారు. తాము ప్రజల కోసమే పనిచేస్తున్నామని, అందుకే ఇలాంటి దాడులను భరిస్తున్నామని వెల్లంపల్లి స్పష్టం చేశారు. బిల్లులు ఆపినంత మాత్రం వారు ఏదో సాధించినట్లు భావిస్తే చాలా తప్పని.. అవి ఎప్పుడు పాస్ కావాలో అప్పుడే అవుతాయని అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: